వెళ్లిపోవాలనుకునే వాళ్లు వెళ్లి పోవచ్చు: పైలట్ ఎగ్జిట్‌పై రాహుల్ స్పందన

న్యూఢిల్లీ: సచిన్ పైలట్ విషయంపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకునే వాళ్లంతా వెళ్లిపోవచ్చన్నారు. అలాగే పార్టీలోకి రావాలనుకునేవారికి ద్వారాలు తెరిచే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం ఎన్‌ఎస్‌యూఐ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ఫోకస్ చేయడం కోసైం మిగతా యువనేతలందరినీ పక్కనపడేస్తున్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో కుర్రాళ్లకు ఓపిక, సహనం ఉండటం లేదని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చిన్న వయసులోనే సచిన్ పైలట్‌ను ఎంపీగా, కేంద్ర మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా, డిప్యూటీ సీఎంగా చేసిందన్నారు.

పైలట్‌ను పార్టీ పదవులనుంచి, డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాక అనేక మంది కాంగ్రెస్ పార్టీ యువనేతలు, సీనియర్లు పైలట్‌కు మద్దతుగా నిలిచారు. ఈ తరుణంలో రాహుల్ వ్యాఖ్యలు పార్టీ వర్గాలకు స్పష్టమైన సందేశం పంపినట్లైంది. తానే సుప్రీం అని చెప్పకనే చెప్పినట్లైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*