
లడక్: రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లడక్ చేరుకున్నారు. ఆయన వెంట త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే తదితరులున్నారు. చైనాతో ఉద్రిక్తతల వేళ రాజ్‌నాథ్ లడక్, జమ్మూకశ్మీర్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. వాస్తవాధీన రేఖ వెంబడి తాజా పరిస్థితిపై సైన్యాధికారులతో సమావేశమై ఆయన సమీక్షిస్తున్నారు. సైనిక బలగాలు జరిపే పారా డ్రాపింగ్ నైపుణ్యాలను రాజ్‌నాథ్ స్వయంగా వీక్షించనున్నారు. లేహ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారత సైనికులను రాజ్‌నాథ్ పరామర్శిస్తారు. లడక్ పర్యటన విశేషాలను ఆయన తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు.
Witnessed the Fire and Fury of the Indian Army during the Para Dropping and other military demonstrations at Stakna near Leh today.
Also, I got the opportunity to interact with them. I am proud of these brave and courageous soldiers. pic.twitter.com/WYJzx6z6Sh
— Rajnath Singh (@rajnathsingh) July 17, 2020
#WATCH: Defence Minister Rajnath Singh among troops at Lukung in Ladakh earlier today. pic.twitter.com/r7ib2ouokA
— ANI (@ANI) July 17, 2020
Ladakh: Defence Minister Rajnath Singh, Chief of Defence Staff General Bipin Rawat and Army Chief General MM Naravane arrive at Stakna, Leh. They will witness para dropping skills of the Armed Forces here. pic.twitter.com/pJ4Njv1BMY
— ANI (@ANI) July 17, 2020
లడక్‌లో పికా మిషన్ గన్ పనిచేసే తీరును రాజ్‌నాథ్ స్వయంగా పరిశీలించారు.
#WATCH Ladakh: Defence Minister Rajnath Singh inspects a Pika machine gun at Stakna, Leh. pic.twitter.com/MvndyQcN82
— ANI (@ANI) July 17, 2020
లడక్ పర్యటన తర్వాత ఆయన జమ్మూకశ్మీర్ వెళ్తారు. అక్కడి తాజా భద్రతా పరిస్థితిని, సైనిక బలగాల సన్నద్ధతపై సమీక్ష జరుపుతారు.
Ladakh: Defence Minister Rajnath Singh, Chief of Defence Staff General Bipin Rawat and Army Chief General MM Naravane at Stakna, Leh. pic.twitter.com/2OUOLyJHwE
— ANI (@ANI) July 17, 2020
జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించి కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. చైనాకు చెందిన యాప్స్‌ను నిషేధించడంతో పాటు వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేసి ఆర్ధికంగా దెబ్బతీయడంతో చైనా దారిలోకొచ్చింది. వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించిన బలగాలను ఉపసంహరించుకుంది.
Be the first to comment