తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో బోనాల పండుగ

సింగపూర్: ఈ ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ నిబంధనల కారణంగా సింగపూర్ బోనాల పండుగ వేడుకలు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) ఆధ్వర్యంలో నిరాడంబరంగా జరిగాయి . ఇక్కడి సుంగే కేడుట్ లోని శ్రీ అరస కేసరి శివన్ దేవాలయము లో సింగపూర్ ప్రభుత్వం మరియు ఆలయ నిబంధనలకు లోపడి బోనాలు సమర్పించడం జరిగింది. స్థానిక నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. సమస్త ప్రజలపై ఆ మహంకాళి తల్లి ఆశిస్సులు ఉండాలని, ప్రపంచాన్ని కరోనా కోరల నుండి కాపాడాలని సభ్యులు ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు. ప్రతి ఏడాది సుమారు వేయి మంది భక్తులతో బోనాల ఊరేగింపు లో పోతరాజులు, పులి వేషాలు, తొట్టెలలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచేవి. కాని ఈ ఏడాది చాలా నిరాడంబరం గా జరిగాయి. ఈ బోనాల పండుగ ను సింగపూర్ కు నాలుగేళ్ళ క్రితం పరిచయం చేయడం ద్వారా TCSS పేరు చరిత్ర లో నిలిచిపోవడం సొసైటీ కి దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని మరియు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయడంలో ఇక్కడి ఏకైక తెలంగాణ సంస్థ, టి‌సిఎస్ఎస్ ఎప్పుడు ముందుంటూ నిర్విరామంగ కృషి చేస్తుందని కార్యవర్గ సభ్యులు అన్నారు. ఈ ఏడాది బోనం సమర్పించిన వారిలో గర్రెపల్లి కస్తూరి శ్రీనివాస్, గొనె రజిత నరేందర్ రెడ్డి , గడప స్వాతి రమేశ్ మరియు బండ శ్రీదేవి మాధవ రెడ్డి దంపతులు ఉన్నారు.

సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు, గడప రమేశ్, గర్రేపల్లి శ్రీనివాస్, మరియు కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, కార్యనిర్వాహక సభ్యులు ప్రవీణ్ కుమార్ చేన్నోజ్వాల, మరియు ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్. ఎమ్, గార్లపాటి లక్ష్మారెడ్డి, గోనె నరేందర్, గింజల సురేందర్ రెడ్డి, మరియు ఇతర సభ్యులు నంగునూరి వెంకట్ రమణ, పెరుకు శివ రామ్ ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, కల్వ లక్ష్మణ్ రాజు, బొండుగుల రాము, జూలూరి సంతోష్ కుమార్, నడికట్ల భాస్కర్, రోజారమణి బొడ్ల, కొల్లూరి శ్రీధర్, కరుణాకర్ గుత్తికొండ మరియు ఆవుల శివ ప్రసాద్ మొదలగు వారు అందరి పై ఉజ్జయని మహంకాళీ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియ జేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*