
భువనేశ్వర్: ఒడిశాలోని కటక్‌కు చెందిన అలోక్ మహంతి అనే ఫర్నీచర్ వ్యాపారి గోల్డ్ మాస్క్ తయారుచేసుకుని వాడుతున్నాడు. ఖరీదు అక్షరాలా మూడున్నర లక్షల రూపాయలు. తనకు బంగారం అంటే చాలా ఇష్టమని తనను అందరూ గోల్డ్ మ్యాన్ అంటారని చెప్పుకొచ్చాడు. ఒంటినిండా బంగారం ఉంగరాలు, చెయిన్లు, బ్రాస్లెట్లతో కనిపించే అలోక్ టోపీలను కూడా బంగారంతో చేయించుకున్నాడు. ఓ ముంబైవాలాతో బంగారు మాస్క్ తయారుచేయించుకున్నానని చెప్పాడు. దీన్ని తయారు చేయడానికి 22 రోజులు పట్టింది. వందగ్రాముల వరకూ బంగారం అవసరమైంది.
మనోడు సరదా కోసం బంగారం మాస్క్ తయారు చేసుకుంటే కొందరు విమర్శలు చేయడం ప్రారంభించారు. కరోనా వేళ జనం దగ్గర డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే సాయం చేసేది పోగొట్టి ఇలా సరదా తీర్చుకోవడానికి బంగారం మాస్క్ చేయించుకుంటాడా అని విమర్శిస్తున్నారు. అయితే అలోక్ మాత్రం ఈ విమర్శలను తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. తాను కూడా సామాజిక సేవ చేస్తున్నానని, వీధి కుక్కలకు, ఇతర పశువులకు ఆహారం పెడుతుంటానని చెప్పుకొచ్చాడు.
Be the first to comment