లడక్, కశ్మీర్ పర్యటనతో సైనికుల్లో స్థైర్యం పెంచిన రక్షణ మంత్రి..

శ్రీనగర్: లడక్, జమ్మూకశ్మీర్ పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నియంత్రణ రేఖ వెంబడి కుప్వారాలో మోహరించిన సైనికులతో ముచ్చటించారు. వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సైనికులతో కలిసి అల్పాహారం చేశారు. సైన్యం సన్నద్ధతను స్వయంగా తెలుసుకున్నారు. రాజ్‌నాథ్ వెంట త్రిదళాధిపతి బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవణే కూడా ఉన్నారు.

అంతకు ముందు రక్షణ మంత్రి రావత్, నరవణేతో కలిసి అమర్‌నాథ్ క్షేత్రాన్ని సందర్శించారు. మంచు లింగం వద్ద ప్రార్ధనలు చేశారు.

చైనాతో ఉద్రిక్తతల వేళ రాజ్‌నాథ్ లడక్, జమ్మూకశ్మీర్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. తన పర్యటనతో రాజ్‌నాథ్ సైనికుల్లో స్థైర్యం పెంచారు. రెండు వారాల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా లడక్‌లో పర్యటించి సైనికుల నైతిక స్థైర్యాన్ని పెంచారు.

మరోవైపు జమ్మూకశ్మీర్ సోపోర్‌లో సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చింది.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*