ప్రభాస్, దీపికా పదుకొనే కాంబినేషన్‌లో నాగ్ అశ్విన్ కొత్త సినిమా

ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్‌గా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో త్వరలో సినిమా రానుంది. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ ప్రకటించింది. వైజయంతీ మూవీస్ ప్రారంభించి 50 ఏళ్లైన సందర్భంగా ఈ మెగా కాంబినేషన్‌లో సినిమా రాబోతోంది.

దీపిక స్వయంగా ట్వీట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ మెగా కాంబినేషన్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీపికకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రభాస్ స్వాగతం పలికారు.

సినిమాకు సంబంధించిన విషయాలను నాగ్ అశ్విన్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.

కరోనా తీవ్రత తగ్గాక వచ్చే ఏడాది సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ప్రభాస్ ప్రస్తుతం పూజా హెగ్డే హీరోయిన్‌గా రాధేశ్యామ్ సినిమా చేస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సినిమా నిర్మిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*