టీ20 వరల్డ్ కప్ పోటీలు వాయిదా వేసిన ఐసీసీ

దుబాయ్: 2020 టీ20 ప్రపంచకప్‌ పోటీలు వాయిదాపడ్డాయి. ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన కీలక సమావేశంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్19 మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ పోటీలను ఐసీసీ వాయిదా వేసింది.

అదే సమయంలో 2021 టీ20 ప్రపంచ కప్ పోటీలు 2021 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ 2021 నవండర్ 14న జరగనుంది.

2022 టీ20 ప్రపంచ కప్ పోటీలు 2022 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ 2022 నవంబర్ 13న జరగనుంది.

2023 టీ20 ప్రపంచ కప్ పోటీలు 2023 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ 2023 నవంబర్ 26న జరగనుందని ఐసీసీ తెలిపింది.

షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు ఆస్ట్రేలియా వేదికగా ప్రపంచ కప్ పోటీలు జరగాలి. కానీ, కరోనా నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్‌ నిర్వహించలేమని క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*