చైనాతో ఉద్రిక్తతల వేళ అండమాన్‌లో భారత్-అమెరికా నేవీ విన్యాసాలు

పోర్ట్‌బ్లెయిర్: అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో హిందూ మహా సముద్రంలో భారత్-అమెరికా నేవీ యుద్ధ విన్యాసాలు చేపట్టాయి. అమెరికా తన విమాన వాహక నౌక నిమిట్జ్‌తో, ఇండియన్ నేవీ షిప్స్ రాణా, సహ్యాద్రి, శివాలిక్, కమోర్తా విన్యాసాల్లో పాల్గొన్నాయి. అణ్వస్త్ర సామర్థ్యమున్న విమానాలను నిమిట్జ్ తీసుకెళ్లగలదు. చైనాతో ఉద్రిక్తతల వేళ భారత్-అమెరికా నేవీ యుద్ధ విన్యాసాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ విన్యాసాలు ఓ రకంగా చైనాను హెచ్చరించినట్లుగానే భావించాలని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు. విన్యాసాలపై భారత్ అమెరికా నేవీ ప్రతినిధులు ట్విటర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. విన్యాసాల వీడియోను జత చేశారు.

మరోవైపు వచ్చే ఏడాది జరగనున్న మలబార్ నేవీ విన్యాసాల్లో ఈసారి భారత్, అమెరికా, జపాన్‌తో పాటు ఆస్ట్రేలియా కూడా పాల్గొనే అవకాశాలున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*