
రాంచీ: కరోనాతో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి చెందిన ఘటన జార్ఖండ్ ధన్బాద్లో జరిగింది. ఈ నెల నాలుగో తేదీన కుటుంబ పెద్ద 88 సంవత్సరాల వృద్ధ మహిళ చనిపోయారు. ఆ తర్వాత ఆమె ఐదుగురు కుమారులు వరుసగా చనిపోయారు. వీరంతా 16 రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. ఆమె ఐదో కుమారుడిని తొలుత ధన్బాద్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రాంచీలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడు ఈ నెల 20న ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ధన్బాద్ సివిల్ సర్జన్ డాక్టర్ గోపాల్ దాస్ వెల్లడించారు. ఒకే కుటుంబంలో ఆరుగురు చనిపోవడంతో ధన్బాద్ ప్రాంతంలో కలకలం రేగింది. ఆనుకుని ఉన్న పశ్చిమబెంగాల్ సరిహద్దును కూడా మూసేశారు. ధన్బాద్లో అధికారులు అలర్ట్ ప్రకటించారు.
జార్ఖండ్లో ఇప్పటివరకూ 5,535మందికి కరోనా సోకింది. 2716 మంది కోలుకున్నారు. ఇప్పటివరకూ 49 మంది చనిపోయారు.
దేశ వ్యాప్తంగా 11లక్షల మంది పైగాకరోనా బారిన పడ్డారు. 7 లక్షలా 25 వేల మంది కోలుకున్నారు. ఇప్పటివరకూ మొత్తం 28,084 మంది చనిపోయారు.
⏺️The number of #COVID19 deaths per million population in continues to be among the lowest in the world.
⏺️#Covid_19 cases per million population in India is 837 which is the lowest in the world.@WHO @PMOIndia @MoHFW_INDIA #IndiaFightsCorona pic.twitter.com/kUQFkQOtyC
— Dr Harsh Vardhan (@drharshvardhan) July 21, 2020
మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో మరణాల సంఖ్య అత్యల్పమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
⏺️Effective clinical management leading to a decrease in the fatality rate.
⏺️ Over a period of time case fatality rate has dropped significantly to 2.43%,@MoHFW_INDIA @PMOIndia @HMOIndia #IndiaFightsCorona pic.twitter.com/qlEYE2aMTH
— Dr Harsh Vardhan (@drharshvardhan) July 21, 2020
కరోనాబారిన పడకుండా ఉండేందుకు భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, ఇంట్లోనూ, బయటా పరిశుభ్రంగా ఉండటం అతి ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. యోగా, ప్రాణాయామం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని యోగా నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వచ్చేవరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండటం వల్లే ప్రాణాలు కాపాడుకోగలుగుతారని వైద్యులు చెబుతున్నారు.
Be the first to comment