ఒకే ఒక్క పాత్రతో ఆదిత్య ఓం “బందీ “

తెలుగు సినిమా కొత్త ఒరవడిని సృష్టిస్తుంది కమర్షియల్ బాట నుండి కొత్త ప్రయోగాల వైపు దృష్టి సారిస్తుంది..తెలుగు ప్రేక్షకులు కూడా ఆ ప్రయోగాలను ఆదరించటం మంచి పరిణామం… లాహిరి లాహిరిలో మొదలుకొని ఎన్నో విజయవంతమైన తెలుగు చిత్రాల్లో నటించిన హీరో ఆదిత్య ఓం..ఓ సరికొత్త ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నారు .ఈ చిత్రానికి “బందీ ” అనే టైటిల్ ని ఖరారు చేశారు .

ఆదిత్య ఓం మాట్లాడుతూ … సినిమా మొత్తం ఒకే ఒక్క పాత్రతో ఉంటుంది , ఇలాంటి ప్రయోగాత్మక సినిమా తెలుగులో రావటం ఫస్ట్ టైం, ఆ అవకాశం నాకు రావడం ఎంతో ఆనందంగా ఉంది , తెలుగు హిందీ తమిళ భాషల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నటించడం చాల ఆనందంగా వుంది . ఇంతకుముందు నన్ను ఎలా ఆదరించారో అలాగే నన్ను ఆదరిస్తారని ఆశిస్తూన్నాను . మా ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను . ఈ సందర్భంగా “బందీ”మూవీలో తన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు…

ఈ చిత్రానికి దర్శకత్వంః రాఘవ.T ఫొటోగ్రఫీః మధుసూధన్ కోట స్క్రీన్ ప్లేః రాకేష్ గోవర్థన్ గిరి

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*