
న్యూఢిల్లీ: అయోధ్య రామజన్మభూమిలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనీయవద్దంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సన్నిహితుడు సాకేత్ గోఖలే అలహాబాద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు భూమిపూజ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. రాముడిని రాజకీయం చేశారని గోఖలే ఆరోపించారు. కరోనా వేళ భూమిపూజ చేయడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని చెప్పారు. అయితే న్యాయస్థానం ఆయన పిటిషన్ను కొట్టిపారేసింది.
మరోవైపు ఆగస్ట్ ఐదున రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆలయ నిర్మాణ భూమి పూజకోసం 150 మంది అతిథులను ఆహ్వానిస్తోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.
Be the first to comment