హీరో విశాల్‌కు, అతడి తండ్రికి కరోనా పాజిటివ్

చెన్నై: హీరో విశాల్‌కు, ఆయన తండ్రికి కరోనా సోకింది. తొలుత తన తండ్రికి పాజిటివ్‌ రాగా ఆయనకు సహకరిస్తున్న తరుణంలో జ్వరం, జలుబు, దగ్గు తదితర పాజిటివ్ లక్షణాలు కనిపించాయని చెప్పారు. ఆ తర్వాత తనకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పరీక్షల్లో తేలిందన్నారు. విశాల్ మేనేజర్‌కు కూడా కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని విశాల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.

ఆయుర్వేదం మందుల ద్వారా తాను తన తండ్రి కోలుకున్నామని చెప్పారు.

సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాజిటివ్‌గా తేలుతున్నారు. హిందీ చిత్ర పరిశ్రమలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య పాజిటివ్‌గా నిర్ధారింపబడి ముంబై నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నటి, ఎంపీ సుమలత కూడా పాజిటివ్‌గా నిర్ధారింపబడి చికిత్స పొందుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*