అయోధ్య రామజన్మభూమిని సందర్శించిన యోగి.. భూమి పూజ ఏర్పాట్లపై సమీక్ష

అయోధ్య: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య శ్రీరామజన్మభూమిని సందర్శించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

భద్రతతో పాటు ఇతర ఏర్పాటపై అధికారులతో యోగి సమీక్ష జరిపారు.

ఆగస్ట్ 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య శ్రీరామజన్మభూమి ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. కార్యక్రమానికి 150 మంది అతిథులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. కేవలం 200 మందితో మాత్రమే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

అతిథులుగా హాజరయ్యేవారిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్, బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, విశ్వహిందూ పరిషత్, ఇతర సంస్థల ప్రముఖులు పాల్గొంటారు.

దశాబ్దాల నిరీక్షణ తర్వాత న్యాయస్థానం తీర్పుతో అయోధ్యలో రామాలయం నిర్మాణమౌతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*