తెలంగాణ బీజేపీ నేత యోగానంద్‌కు కరోనా వారియర్ ఇంటర్నేషనల్ అవార్డు

హైదరాబాద్: కరోనా సమయంలో నిరు పేదలను ఆదుకున్న జీవై ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యోగానంద్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఆయనకు కరోనా వారియర్ ఇంటర్నేషనల్ అవార్డు ప్రకటించింది.

హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గంతో పాటు హైదరాబాద్‌లో పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి జీవై ఫౌండేషన్ అనేక ప్రాంతాల్లో పేదవారికి నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, వంట నూనెతో పాటు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసింది.


50 వేల మందికిపైగా సాయమందించినట్లు జీవై ఫౌండేషన్ ప్రకటించింది.

జీవై ఫౌండేషన్ విద్య, వైద్యం, రక్తదానం శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలను చేపడ్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*