
అమరావతి: సినీ నటుడు సోనూ సూద్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు అభినందించారు. ఫోన్ చేసి ఆయన్ను ప్రశంసించారు. చిత్తూరు జిల్లా కెవి పల్లి మండలం మహల్ రాజపల్లిలో కాడెద్దులుగా మారి కుమార్తెలే తండ్రికి పొలం పనుల్లో సాయపడటంపై సోనూసూద్ స్పందించి ఆ కుటుంబానికి ట్రాక్టర్ అందించడాన్ని చంద్రబాబు అభినందించారు. సోనూ సూద్ స్పందన అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు.
Spoke with @SonuSood ji & applauded him for his inspiring effort to send a tractor to Nageswara Rao’s family in Chittoor District. Moved by the plight of the family, I have decided to take care of the education of the two daughters and help them pursue their dreams pic.twitter.com/g2z7Ot9dl3
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) July 26, 2020
దళిత రైతు నాగేశ్వర రావు కుమార్తెల చదువుల బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు ఫోన్ చేసి తనను అభినందించడంపై సోనూసూద్ ధన్యవాదాలు తెలిపారు. త్వరలో కలుసుకుందామంటూ ట్వీట్ చేశారు.
Thank you so much sir for all the encouraging words. Your kindness will inspire everyone to come forward and help the needy. Under your guidance millions will find a way to achieve their dreams. Keep inspiring sir. I look forward meeting you soon. 🙏🇮🇳 https://t.co/XruwFx1vy2
— sonu sood (@SonuSood) July 26, 2020
Be the first to comment