
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎంపికయ్యారు. దీనికి సంబంధించి బీజేపీ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది.
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ @somuveerraju గారిని పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ @JPNadda గారు ప్రకటించారు.
పార్టీ సీనియర్ నాయకులు శ్రీ సోము వీర్రాజు గారికి ఏపీ బిజెపి తరపున మరియు రాష్ట్రవ్యాప్త పార్టీ శ్రేణుల తరుపున హృదయపూర్వక శుభాకాంక్షలు. pic.twitter.com/VaECeHkO5D
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) July 27, 2020
వీర్రాజు పేరు ప్రకటించగానే ఏపీ బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది.
శ్రీ సోము వీర్రాజు గారిని ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడు శ్రీ @JPNadda నియమించారు. భారతీయ జనతా పార్టీతో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం వున్న వీర్రాజుగారి నాయకత్వంలో బీజేపీ ఒక పెద్ద రాజకీయ శక్తిగా ఎదుగుతోంది అనటంలో సందేహం లేదు. @BJP4Andhra @somuveerraju pic.twitter.com/yKx91dTt4q
— GVL Narasimha Rao (@GVLNRAO) July 27, 2020
సోషల్ మీడియాలో ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.
నూతన @BJP4Andhra రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన @somuveerraju సోము వీర్రాజు గారికి శుభాకాంక్షలు pic.twitter.com/0OZB5amTWL
— Manthri Srinivasulu (@manthriji) July 27, 2020
సోము వీర్రాజు ఆకట్టుకోగలిగే మాట్లాడగలరు. వివిధ అంశాలపై స్పష్టంగా తన వైఖరిని తెలియజేస్తారు. తెలంగాణలో బండి సంజయ్ తరహాలో ఆయన కూడా దూకుడుగా వ్యవహరిస్తారు. ఆయన లాగే యూత్‌లో సోము వీర్రాజుకు కూడా క్రేజ్ ఉంది.
Be the first to comment