సింగపూర్‌లో జూమ్ కాల్ ద్వారా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

సింగపూర్‌:శ్రావణమాసం నాగ పంచమిని పురస్కరించుకుని సింగపూ‌ర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశారు. 60 కుటుంబాల వారు జూమ్ కాల్ ద్వారా ఒకే సమయంలో ఇందులో పాల్గొన్నారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన “వాసవి సిస్టర్స్”పామిడి నాగమణి మనోహర్, గరికపాటి జయ లక్ష్మి జూమ్ కాల్‌లో అన్నమాచార్య కీర్తనలు, సత్యనారాయణ స్వామి పాటలు ఆలపించారు.

కడప జిల్లా చిలంకూర్‌లో ఉంటున్న కావ్య శర్మ సమన్వయం చేస్తూ అందరి చేత పూజా విధానాన్ని జూమ్ ద్వారా జరిపించారు. ఇళ్ల వద్దనుంచే అంతా కుటుంబ సమేతంగా వ్రత కథలను వింటూ ఆధ్యాత్మిక సాగరంలో మునిగితేలారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ గొట్లూరు మాట్లాడుతూ కొవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో కూడా సింగపూర్‌లో నివసిస్తున్న ఆర్యవైశ్యులందరు ఇందులో పాల్గొని శ్రావణమాస వ్రతాలు చేయడం ఆనందంగా వుందన్నారు. సంస్థ జనరల్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి మాట్లాడుతూ సింగపూర్‌లో ఆర్యవైశ్యులందరు వాసవి మాత ప్రవచించిన ధర్మ సూక్ష్మాలను, దాన ధర్మాలను ఇలానే కొనసాగించాలని ఆకాంక్షించారు.

కోవిడ్ ప్రత్యేక పరిస్థితుల్లో కూడా సింగపూర్ వాసవి క్లబ్ ప్రతి శనివారం వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోందని చార్టెడ్ ప్రెసిడెంట్ వెంకట నాగరాజ్ కైలా ప్రశంసించారు. కమిటీ కోర్ సభ్యులు ముకేశ్ భూపతి, రాజశేఖర్ గుప్త, ముక్కా కిషోర్, మురళి పబ్బతి తదితరులు కార్యక్రమాలను దిగ్విజయం చేసేందుకు కృషి చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*