సక్సెస్‌ని నా లైఫ్‌కి గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నా: రేడియో జాకీ రేణు

జీవితం విసిరిన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్న ధీశాలి ఆమె. ఫెయిల్యూర్స్‌ని సక్సెస్‌కు బాటగా వేసుకున్న నేర్పరి. అందరిలాగే కెరీర్‌ ప్రారంభించినా తన సంకల్ప శక్తితో అంచెలంచెలుగా ఎదుగుతూ ఆదర్శంగా నిలుస్తోంది. రేడియోలో మొదలైన ఆమె జర్నీ ఈటీవీ,జెమినీ టీవీని దాటుకుని సొంతంగా యూ ట్యూబ్ ఛానెల్ పెట్టేవరకూ సాగింది. ఆమె మరెవరో కాదు రేడియో జాకీ, vlogger రేణు.


1. RJ కావాలని చాలామంది కోరిక. మీరు RJ అవుతారని అనుకున్నారా?

చాలా మందికి రేడియో జాకీ అవ్వాలని ఉంటుంది. అయితే నేను rj అవుతానని అస్సలు అనుకోలేదు. ఇది నా డెస్టినీ అనుకుంటా.


2. ఆల్ ఇండియా రేడియోలో రేడియో జాకీగా చేస్తారు కదా. ఆ ఎక్స్పీరియన్స్ చెబుతారా?

నేను 101.9 రెయిన్‌బో fm లో rj గా వర్క్ చేస్తున్నాను. నేను ఒక శ్రోతగా ఆడిషన్స్ ఉన్నాయని విని అప్లై చేసి సెలెక్ట్ అయ్యాను. ఇంటర్వ్యూకి వెళ్లేవరకు కూడా నాకు ఎలా మాట్లాడాలి? ఎలా రాయాలో తెలియదు. బట్ రాత పరీక్షకు నాకున్న వ్యాసరచన బాగా సహాయపడింది. ఇక వాయిస్ ఇంటర్వ్యూకి తాతయ్య నేర్పిన పద్యాలూ బాగా ఉపయోగపడ్డాయి. అల్ ఇండియా రేడియోలో పనిచేస్తుండగానే ఈటీవీలో ఉద్యోగం పొందాను.

3. మీకు ఎక్కువ రెస్పాన్స్ వచ్చిన టాపిక్ ఏది?

నాకు బాగా పేరు తెచ్చిన ‘ఎదురింటి పుల్లకూర రుచేందుకు నాకు బాగా పేరు తెచ్చిన ప్రోగ్రామ్స్ కిడ్స్.కం చిన్నపిల్లలా ప్రోగ్రామ్. అలాగే వృద్ధాశ్రమాలు, అనాథ ఆశ్రమాలకు వెళ్లి లైవ్ ప్రోగ్రామ్స్ చేయటం వల్ల సామాజిక సేవ చేయాలనే కోరిక తీరింది.


4. టాపిక్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు?

నా టాపిక్స్ అన్నీ నా జీవితానుభవాలు, సమాజంలో జరుగుతున్న సంఘటనలు, నా ఆలోచనలనుంచే తీసుకుంటాను. నేను చుసిన సంఘటనలనే టాపిక్స్‌గా తీసుకుంటాను. అందుకే నా టాపిక్స్ ఫ్రెష్‌గా ఉంటాయి.

5. అప్పుడప్పుడు పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అవుతుంటారు కదా.. ఎలా అనిపిస్తుంది?

పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అవ్వటం చాలా ఆనందకరమైన విషయం, వాళ్ళ అనందం కష్టం, బాధ అన్ని మాతో పంచుకుంటారు.

6. మీకు ఫ్యాన్స్ వుంటారుగా… ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది?

ఫ్యాన్స్ .. వాళ్ళు లేకపోతే మనం లేము. మనం ఎంత బాగా షో చేసినా ఆదరించే వారుంటేనే గుర్తింపు. “మిమ్మల్ని ఒక్కసారైనా చూడాలి “,”అమ్మ రేణు లాస్ట్ వీక్ రాలేదెందుకు” అని అడుగుతుంటారు. నా షో విని rjs అయ్యాం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మన మాట ఒక్కరిలో మార్పు తెచ్చినా చాలనుకుంటాను. ఆలా మారిన వారు కూడా ఉన్నారు.


7. రేడియో జాకీగా కాకుండా ఇంకా ఏం చేస్తుంటారు?

నేను ఈటీవీ, జెమిని, ఈటీవీ అభిరుచి ఛానెల్స్‌లో పని చేశాను ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా. ఇప్పుడు సొంతంగా rjrenuvlogs అని యూట్యూబ్ స్టార్ట్ చేశాను.
#ఫిక్షన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేసినప్పటినుంచి నాకు నేను సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది.
నాకు ఏమాత్రం టైం దొరికినా కిటికీ దగ్గర కూర్చుని ఆలోచించటం ఇష్టం చెట్లని చూడటం వర్షాన్ని ఆ కిటికీలోంచి ఆస్వాదించటం చాలా ఇష్టం.


8. ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు?

ఫ్రీ టైములో కవితలు కథలు రాసుకుంటున్నా. నేను స్కూల్ డేస్ నుంచే చాలా కథలు రాసేదాన్ని. కొత్తకొత్త స్నాక్స్ చేయటం, కొత్త కొత్త బ్లౌజ్ లెహంగాస్ చుడీదార్స్‌ డిజైన్ చేస్తాను.

9. మీ అభిరుచులు?

పుస్తకాలు చదవటం ,ట్రావెలింగ్ సాంగ్స్ వినటం మూవీస్ చూడటం ,dancing


10. మీకు vlog ఉంది కదా.. దాని గురించి చెప్పండి

నేను మీడియాలో వర్క్ చేసి బయటకొచ్చాక నాకంటూ ఉన్న ఆలోచనలతో నా సొంతంగా ఏదైనా చేయాలనుకుని rjrenuvlogs అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. లైఫ్‌‌స్టైల్, కుకింగ్, బ్యూటీ టిప్స్, నా మెయిన్ థీమ్స్.


11. Vlog, రేడియో షోస్ టైం ఎలా మేనేజ్ చేస్తారు?

ఇష్టం కాబట్టి చేయగలుగుతున్నా. రేడియో నాకు బాగా నచ్చిన పని. నేను సమయాన్ని బాగా బ్యాలన్స్ చేసుకుంటాను. ఏదైనా కష్టం అయినా ఇష్టపడి చేస్తా. సో అన్నీ బ్యాలన్స్ చేయగలుగుతున్న ఒకప్పుడు vj గా చేశాను. ఈటీవీలో స్కూల్ డేస్‌లో “నవ్వితే నవరత్నాలు ” అనే ప్రోగ్రామ్, ఆ తరువాత మనోరంజని ఇలా కొన్ని సీరియల్స్‌లో కూడా చేశాను.

12. ఎడిటింగ్ ఎప్పుడు నేర్చుకున్నారు?

యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాకే ఎడిటింగ్ నేర్చుకున్నాను. నువ్వు చేయలేవు అంటే చేసి చూపించాలనిపిస్తుంది. జీవితంలో జరిగిన అనేక సంఘటనలు నాకు పాఠాలు నేర్పాయి. సో … ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను.

13. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటీ?

ఫ్యూచర్ ప్లాన్స్ మారుతూ వచ్చాయి. నేను పెరిగిన వాతావరణం, నేను చూసిన మనుషులు, పరిస్థితులు, ఇవన్నీ
ఒక మంచి యూట్యూబర్ అవ్వాలనేదే నా ఫ్యూచర్ ప్లాన్.

14. RJ కాకపోతే ఏమి చేసేవారు?

rj కాకపోతే అనేది ఎప్పుడు నా ఊహకు రాలేదు. ఎందుకంటే నాకెందుకో ఇట్స్ మై డెస్టినీ అనిపిస్తుంది. ఇది మనసుతో చేసే పని. ఒకవేళ నేను rj కాకపోతే ఆర్టిస్ట్ అయ్యేదాన్ని.

15. RJ లు కావాలనుకునే వారికి మీరు ఇచ్చే మెసేజ్!

rj లు అవ్వాలనుకునే వారు బాగా సాహిత్యం చదవండి. రాయండి. సామాజిక. రాజకీయ. సినీ విషయాల మీద పట్టు సాధించండి. మంచి వాయిస్, భాష ఇంప్రూవ్ చేసుకోండి.

16. టీవీ ఛానెళ్లలో అనుభవాలు చెబుతారా?

డిగ్రీ చేయగానే టాటా కన్సల్టెన్సీలో టెలీ‌కాలర్‌గా జాయిన్ అయినపుడు రేడియో ఆడిషన్ గురించి తెలిసింది. రేడియోలో జాయిన్ అయ్యాక వుమెన్స్‌డే ఇంటర్వ్యూ చేసినపుడు సఖి ప్రోగ్రామ్ చేసే ఆఫర్ వచ్చింది. అక్కడే ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను. ఆ తరువాత జెమినీ మ్యూజిక్‌లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేశాను. ఇక్కడ నాకు జీవితం చాలా నేర్పించింది. ఎన్నో సవాళ్లు ఎదుర్కున్నాను. అదే సమయంలో లైఫ్‌ను ఎలా లీడ్ చేయాలో నేర్చుకున్నాను. జెమిని నుంచి బయటకొచ్చాక ఈటీవీ అభిరుచి‌లో ప్రోగ్రామర్‌గా జాయిన్ అయ్యాను. ఓవర్ ఆల్‌గా చెప్పేదేంటంటే జీవితంలో గెలుపోటములు సాధారణమే. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకూడదు. జీవితం నాకు చాలా నేర్పించింది అందుకే సక్సెస్‌ని నా లైఫ్‌కి గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నా.

17.మీ ఫ్యామిలీ గురించి చెప్పండి.

మాది ప్రేమ వివాహం మా వారు పృథ్వి కృష్ణ. బిజినెస్ చేస్తుంటారు. నాకో పాప. కృష్ణ వర్షిణి..ప్రీ స్కూల్ చదువుతోంది. ఒక తమ్ముడు, అమ్మ, అత్త, మావయ్య. కుటుంబమే నా లోకం. కుటుంబం బలంగా ఉండాలని కోరుకుంటా.

18. మీలో మీకు నచ్చేది

నాలో నాకు నచ్చేది … నేనే. సవాళ్లకు బెదరని ఆత్మవిశ్వాసం నాది.


19. మీలో మీకు నచ్చనిది!

రాజీపడటం(కొన్ని సందర్భాల్లో)

20. మీలో మీరు మార్చుకోవాలనుకునే అంశాలు

వెరీ ఎమోషనల్ నేను. మొహమాటం , ఈ రెండు మార్చుకోవాలి .

21. దేవుడు వరం ఇస్తే ఏం కోరుకుంటారు.?

అమ్మానాన్నతో కలిసుండాలని కోరుకుంటాను.

-మంజీత బందెల(ఈక్షణం జర్నలిస్ట్, బెంగళూరు),
-విజయ్ కొత్తూరు (ఈక్షణం జర్నలిస్ట్, విజయవాడ 94934 39425).

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*