కరోనా నుంచి షా త్వరగా కోలుకోవాలంటూ ప్రార్ధనలు

న్యూఢిల్లీ: కరోనా నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు, సన్నిహితులు, బీజేపీ కార్యకర్తలు ప్రార్ధనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా షా త్వరగా కోలుకోవాలంటూ పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ట్వీట్ చేశారు. సంకల్పశక్తితో షా త్వరలోనే కరోనాపై విజయం సాధించగలరనే విశ్వాసం తనకుందని రాజ్‌నాథ్ తెలిపారు.

అంతకు ముందు తనకు పాజిటివ్ వచ్చిన విషయాన్ని అమిత్ షా ట్విటర్ ద్వారా తెలిపారు. తన ఆరోగ్యం బాగుందని చెప్పారు. డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నానని చెప్పారు. కొద్ది రోజులుగా తనను కలిసినవారు చికిత్స చేయించుకోవాలని, హోం క్వారంటైన్ అవ్వాలని షా సూచించారు.

మరోవైపు ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి డైరక్టర్ గులేరియా నేతృత్వంలో డాక్టర్ల బృందం అమిత్ షాకు చికిత్స అందిస్తోంది.

అటు షాను రెండు రోజుల క్రితం కలిసిన కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో తాను క్వారంటైన్ అయినట్లు వెల్లడించారు. డాక్టర్ల సలహా మేరకు తాను కుటుంబసభ్యులతో పాటు ఇతరులను కూడా కొద్దిరోజుల పాటు కలవబోనంటూ ట్వీట్ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*