శ్రోతల లైఫ్‌ని టచ్ చేస్తేనే నిజమైన సంతృప్తి: రేడియో జాకీ డాక్టర్ హరీశ్


చూడటానికి అచ్చం సినిమా హీరోలా ఉండే ఆ యువకుడు వృత్తిరీత్యా డాక్టర్. అయినా రేడియో అంటే అభిమానంతో రేడియో జాకీ అయ్యాడు. చాటర్ బాక్స్‌లా ఏదో ఒకటి వాగేయడం ఇష్టపడక కాసేపు మాట్లాడినా గుండెకు హత్తుకుపోవాలంటాడు. రేడియోను అత్యంత శక్తిమంతమైన మాధ్యమంలా భావిస్తూ యువతలో, సమాజంలో మార్పు తెచ్చేందుకు దాన్నొక ఆయుధంలా చేసుకోవాలని తపనపడతాడు. నిత్యం కొత్తదనం కోసం తాపత్రాయపడుతుంటాడు. డెంటల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌ అయినా.. వేదసహస్రపాత్ మెడిటేషన్ నేర్పించినా.. సినిమాలకు, సీరియల్స్‌కు డబ్బింగ్ చెప్పినా తనదైన ముద్ర కోసం తపిస్తాడు. జోష్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన ఆ యువకుడే హరీశ్ తెన్నేటి. డాక్టర్ హరీష్ తెన్నేటి. రేడియో మిత్రులు, శ్రోతలంతా హ్యారీ పోటర్ హరీష్‌గా గుర్తుపడతారు. ఈక్షణం పాఠకులకు తన అనుభవాల్ని షేర్ చేసేందుకు సమయమిచ్చారు.

ఆల్ ఇండియా రేడియో.. FM రెయిన్‌బోలో చాలా ఏళ్లుగా రేడియో జాకీ గా చేస్తున్నారు కదా.. ఆ ఫీలింగ్ గురించి చెప్పండి!

ఆ ఫీలింగ్ గురించి మాటల్లో చెప్పలేను… ఎంతోమంది జీవితాలను తాకగల శక్తి ఒక రేడియో జాకీకి ఉంటుంది అని బాగా నమ్ముతా నేను. అందుకే Rj అంటే ఒక గ్రేట్ ఫీలిం‌గ్‌ నాకు. పదేళ్లనుంచి రేడియో జాకీగా చేస్తున్నా కూడా ప్రతి ప్రోగ్రాం స్పెషల్ గా ఉంటుంది… ఎంతో మంది కళాకారులకి ఆల్ ఇండియా రేడియో ఒక అమ్మలాంటిది. రెయిన్‌బో ఎఫ్‌ఎంలో గొప్పతనం ఏంటంటే… పబ్లిసిటీ కోసమో, డబ్బుల కోసమో, చీప్ ప్రోగ్రామ్స్ ఉండవు. ఇన్ఫోటైన్మెంట్ ఉంటుంది.

మీ ఊరు ఎక్కడ? ఫ్యామిలీ గురించి?

మా ఊరు మా ఆస్తులు మా అంతస్తులు మా మనుషులు మా మనసులు అన్నీ హైదరాబాద్…మేము హైదరాబాద్ వాళ్ళం. ఫ్యామిలీ విషయానికి వస్తే వైఫ్ కూడా డెంటల్ డాక్టర్, MDS, రూట్ కెనాల్ స్పెషలిస్ట్. మూడేళ్ల కుమార్తె ఉంది.

అసలు RJ గా ఛాన్స్ ఎలా వచ్చింది?

ఆల్ ఇండియా రేడియో రెయిన్‌బో ఎఫ్‌ఎంలో RJ రాధా… ఆడిషన్స్ ఉన్నాయి ట్రై చేయమని సలహా ఇచ్చారు… ఆడిషన్ ఇచ్చాను…. సెలక్ట్ అయ్యాను…. అంతకు ముందు అనుభవం లేదు. కానీ అన్నీ ఇక్కడే నేర్చుకున్నా..

ఎప్పుడైనా మీరు RJ అవుతారని అనుకున్నారా?

Rj అవుతానని అనుకోలేదు కానీ ఎప్పుడు నా గొంతు బాగుండాలని.. నా మాట అందరూ వినాలని… విన్న వాళ్ల మనసు ఆకట్టుకోవాలని చిన్నప్పటి నుంచి అనుకునే వాడిని. ఆ కోరికను ఆర్జే నిలబెట్టింది.


RJ కాకుండా ఇంకేం చేస్తుంటారు?

నేను ఓరల్ అండ్ మాక్సిల్లో ఫేషియల్ సర్జన్… డెంటల్ సర్జరీ తరవాత MDS స్పెషలైజేషన్ ఫేషియల్ సర్జరీ… సింపుల్‌గా చెప్పాలంటే డెంటల్ అండ్ ఫేస్ సర్జన్. డెంటల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా చేస్తున్నాను, ఇవి కాకుండా వేదసహస్రపాత్ అని మెడిటేషన్ నేర్పిస్తాను. సినిమాలకు, సీరియల్స్‌కు డబ్బింగ్ ఇస్తాను. బ్రెయిన్ అండ్ లైఫ్ కి సంబంధించిన కోర్సులు నేర్పిస్తాను.

ఎన్ని ఏళ్లుగా డాక్టర్‌గా చేస్తున్నారు? ఎక్కడ చేస్తున్నారు?

పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక ఎనిమిదేళ్ల అనుభవం ఉంది నాకు. డెంటల్ అండ్ ఫేషియల్ సర్జరీకి సంబందించిన అన్ని ప్రొసీజర్స్ నేను రాంనగర్‌లో నా డెంటల్ హాస్పిటల్‌లో చేస్తాను.

డాక్టర్‌గా చేస్తూనే… RJ గా చేయడం ఎలా అనిపిస్తుంది.?

డాక్టర్ అండ్ Rj గా మంచి ఫీలింగ్ వస్తుంది నాకు. రెండు రంగాలూ నాకు చాలా ఇష్టం.

డాక్టర్ అంటే ఫుల్ బిజీ, మరి టైం ఎలా మేనేజ్ చేస్తారు?

బిజీగా ఉండడమే బాగా అనిపిస్తుంది నాకు. ఫ్రీ టైం అంటే అసలు నచ్చదు. ఏదో ఒకటి కొత్తగా చేయలని ట్రై చేస్తూనే ఉంటా. లక్కీగా ఫ్యామిలీ సపోర్ట్.. వైఫ్ సపోర్ట్ ఉండడం వల్ల అంతా సవ్యంగా సాగిపోతోంది. ప్రస్తుతానికి అన్నీ మేనేజ్ అవుతున్నాయి. నచ్చినవి అన్నీ చేస్తున్నా.

ఎప్పుడైనా మీ పేషెంట్స్ మిమ్మల్ని RJ అని గుర్తు పట్టారా?

నా పేషెంట్స్‌కి అసలు చెప్పను నేను Rj అని. ఎప్పుడైనా తెలిస్తే సర్ప్రైజ్ అవుతారు. అలాగే శ్రోతలకు ఎవ్వరికి కూడా నేను డాక్టర్ అని చెప్పను. రెండు సెపెరేట్‌గా ఉంచడం ఇష్టపడతాను.

మీకు ఎక్కువ రెస్పాన్స్ వచ్చిన టాపిక్ ఏది? టాపిక్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు?

టాపిక్స్ కరెంట్ ఇష్యూస్ మీద తీసుకుంటాను. అందులోనూ యూత్, హ్యూమన్ వాల్యూస్ అండ్ హ్యూమన్ లైఫ్ మీద. ఎక్కువ మాట్లాడానికి
ప్రయత్నం చేస్తాను. ఒకటి అని చెప్పలేను. శ్రోతలు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు నాకు. వాళ్ళకి కూడా థాంక్స్. కొన్ని అనుకునేంత బాగా రాకపోయినా ఇంకా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తాను.

అప్పుడప్పుడు పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అవుతుంటారు కదా.. ఎలా అనిపిస్తుంది?

ఇంటరాక్షన్ ఈజ్‌ ది బెస్ట్ పార్ట్. మన మాటలకి వాళ్ళ స్పందన కలిస్తే లైవ్లీ గా ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు, హ్యూమన్ లైఫ్‌ని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. పొరపాటున కూడా ఎవరిని కామెడీ చేయాలనీ, తక్కువ చేసి మాట్లాడటం ఎట్టి పరిస్థితిలోనూ చేయను.


మీకు ఫ్యాన్స్ వుంటారుగా… ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది?

ఫాన్స్ ఎవ్వరు లేరండి. ఫ్రెండ్స్ ఉంటారు. కొంత మంది ఫలానా టాపిక్ బాగా చెప్పానంటారు అంతే. రేడియో ఫ్రెండ్స్. నేను పేషెంట్స్ అని కూడా అనను. డాక్టర్‌కి ఫ్రెండ్స్ అంతే. ఫ్యాన్స్ అనేసరికి ఏదో కొమ్ములు వచ్చినట్టు అనిపిస్తుంది.


ఫ్యాన్స్ తో మీకు గుర్తుండిపోయిన ఎక్స్పీరియన్స్?

చాలా ఉన్నాయి. ఎనర్జీ ఇస్తాయి తలచుకుంటే. ఒకసారి 17 సంవత్సరాల ఓ టీనేజర్ డిప్రెషన్‌లో ఉండి సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన మార్చుకుని లైఫ్‌ని కొత్తగా చూడడానికి నా ప్రోగ్రాం కారణమని కాల్ చేసి చెప్పినపుడు హ్యాపీగా అనిపించింది. అలాగే ఒక తొంబై ఏళ్ల వృద్ధ మహిళ బ్రతకడం నేర్పించావయ్యా అన్నపుడు హ్యాపీగా అనిపించింది. గొప్ప కోసం చెప్పట్లేదు కానీ నిజంగా చెప్తున్నా.. లైఫ్‌ని టచ్ చేసినపుడు ఆ హ్యాపీనెస్ చాలా బావుంటుంది.

మీ లైఫ్ లో రేడియో అంటే ఒక్క మాటలో ఏంటీ?

రేడియో ఈజ్ లైఫ్. ఎంతో మందిని, వాళ్ళ జీవితాలని ప్రభావితం చేయగల గొప్ప మాధ్యమం.

మీ ఇన్స్పిరేషన్ ఎవరు?
ఇన్స్పిరేషన్ మాత్రమే కాదు…. నేను మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతీ పని, మా నాన్న VSP తెన్నేటి గారి దగ్గర్నుంచి నేర్చుకున్నవే.

https://www.instagram.com/rjharry198/

మీలో మీరు మార్చుకోవాలి అనుకుంటున్నది ఏది?

చాలా మార్చుకోవాలి. పెద్ద లిస్ట్ ఉంది. కానీ అన్నిటికంటే ముందు ఫోన్‌కి దూరంగా ఉండడం నేర్చుకోవాలి.

మీలో మీకు నచ్చేది?

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలను.

RJ లలో మీరు ఎవరిని ఫాలో అవుతారు?

Rj లలో నేను ఎవరినీ ఫాలో అవను. నా స్టైల్ పాడైపోతుంది.

RJ లు కావాలనుకునే వారికి మీరు ఇచ్చే మెసేజ్..?

Rj కావాలనుకుంటే అన్నిటి మీదా అవగాహనా ఉండాలి. కరెంటు అఫైర్స్ తెలిసి ఉండాలి. భాష మీద గ్రిప్ ఉండాలి. ముందుగా RJ అనగానే చాటర్ బాక్స్.. ఏదో ఒకటి వాగేయాలనే ఆలోచన వదిలేసి కొద్ది సమయం క్లారిటీగా కంటెంట్ మాట్లాడగలగాలి.

-మంజీత బందెల(ఈక్షణం జర్నలిస్ట్, బెంగళూరు),
-విజయ్ కొత్తూరు (ఈక్షణం జర్నలిస్ట్, విజయవాడ 94934 39425).

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*