
ముంబై: బాలీవుడ్ నటుడు ఆసుపత్రిలో చేరాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా టెస్టులో ఆయనకు నెగెటివ్ వచ్చింది.
సంజయ్ దత్ నర్గీస్, సునీల్ దత్ కుమారుడు. ముంబై పేలుళ్ల కేసులో ఉగ్రవాదులకు సహకరించిన కేసులో జైలుశిక్ష అనుభవించి విడుదలయ్యాడు. సంజయ్ దత్ సోదరి ప్రియాదత్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు.
Although younger to me, you two have always been my biggest support system, motivating me and being there for me throughout my life. I love you both so much. #HappyRakshaBandhan❤️ @PriyaDutt_INC #NamrataDutt pic.twitter.com/BMMXCjUCWz
— Sanjay Dutt (@duttsanjay) August 3, 2020
ఖల్నాయక్ మొదలుకొని మున్నాభాయ్ ఎంబీబీఎస్ వరకూ అనేక హిట్ సినిమాల్లో సంజయ్ దత్ నటించారు. ఇప్పుడు కూడా కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు.
The road to love is the road to take. Join us in the journey as #Sadak2 streaming on @DisneyPlusHotstarVIP from 28 August #DisneyPlusHotstarMultiplex@aliaa08 #AdityaRoyKapur @PoojaB1972 @MaheshNBhatt #MukeshBhatt #SuhritaSengupta @wrkprint @foxstarhindi @VisheshFilms pic.twitter.com/tgtWr6BORn
— Sanjay Dutt (@duttsanjay) August 6, 2020
ఇటీవల కాలంలో బాలీవుడ్ నటులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలే అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ కరోనాతో ముంబై లీలావతిలో చేరి డిశ్చార్జ్ అయ్యారు.
Be the first to comment