
సింగపూర్ అమెరికన్ స్కూల్ నుండి ఉన్నత పాఠశాల లో చదువుతున్న తెలుగు విద్యార్థి శ్రీహర్ష శిఖాకోళ్ళు మరియు అతని స్కూల్ సహవిద్యార్థి తో కలిసి Econ101 అనే నూతన సంస్థ ని స్థాపించి, యువ విద్యార్థుల కోసం ఆర్ధిక అక్షరాస్యత మీద అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. గతంలో కూడా శ్రీహర్ష, కోవిడ్ -19 కారణంగా బాధపడుతున్నవారికి సహాయం చేయడానికి, సుమారు 20 లక్షలు రూపాయల (36,314$) నిధులను సేకరించారు. తన 90 రోజుల ప్రచారంతో Give.sg అనే స్వచ్చంద సంస్థ ద్వారా “అవసరమైనవారికి సహాయం చేయండి మరియు ఆశను ఇవ్వండి” అనే నినాదంతో విరాళాలు సేకరించి స్వచ్చంద సంస్థలకు అందచేశారు.
ఇప్పుడు జూమ్ కాల్ ద్వారా వారం రోజుల సెషన్లు ఉచితంగా నిర్వహిస్తున్నారు. కొన్ని వారాల క్రితం నిర్వహించిన మొదటి సెషన్ కు అనూహ్య స్పందన రావడం తో ఇప్పుడు రెండవ సెషన్‌కు రిజిస్ట్రేషన్లు తెరవబడ్డాయి. రిజిస్ట్రేషన్ కోసం బ్రోచర్ మరియు లింక్ ఇక్కడ జత చేయడం జరిగింది. కోర్సు విషయాలు 8 – 12 సంవత్సరాల మధ్య వయస్సు గలవారి కోసం రూపొందించబడ్డాయి.
https://www.linkedin.com/feed/update/urn:li:activity:6693447685283966976/
చిన్న వయస్సు నుండే ఆర్థిక అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలిసినందున, మీ పిల్లలు మరియు వారి స్నేహితులందరూ ఆన్లైన్ లింక్‌ను ఉపయోగించి నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Be the first to comment