మై నేషన్ ఆధ్వర్యంలో జాతీయ విద్యా విధానం 2020పై ఆన్‌లైన్ చర్చ

హైదరాబాద్: భారత ప్రభుత్వం విద్యా విధానంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి దేశీయ విధానం అమలు చేయడానికి శ్రీకారం చుట్టే క్రమంలో జాతీయ విద్యా విధానం 2020 ప్రజల ముందు పెట్టింది. దేశ వ్యాప్తంగా NEP 2020 మీద అనేక చర్చలు, గోష్టులు, వెబినార్లు జరుగుతున్నాయి. ఈ విద్యావిధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ విమర్శ చేసే వారు లేకపోలేదు. వారి గొంతులు మీడియా ద్వారా కొద్దిగా ఎక్కువే వినిపిస్తున్నాయి.

https://www.youtube.com/channel/UCfAoPg_Zw6MpjPrh-3cLZHg

నిజంగా అసలు ఈ విధానాన్ని విమర్శ చేసి NEPకి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అంశాలు ఈ డ్రాఫ్ట్‌లో ఏమున్నాయి? లేదా ఇందులో పొందుపరచిన ఏఏ అంశాలు అమలు చేయడం ద్వారా విద్యార్థుల సంపూర్ణ వికాసానికి ఎలా తోడ్పడుతుంది? తల్లిదండ్రులు ఏ విధంగా లబ్ది పొందుతారు? దేశానికి /సమాజానికి ఏ మేర ప్రయోజనకారి అవుతుంది? అనే విషయాలు MY NATION చర్చకు తెర లేపింది.

ఇందులో భాగంగా 15.08.2020 శనివారం సాయంత్రం 5 గంటలకు జూమ్ , ఫేస్ బుక్, యూ ట్యూబ్‌లలో ఈ చర్చా వేదికను పంచుకొవాల్సిందిగా మై నేషన్ ఆహ్వానం పలుకుతుంది. ఈ క్రింద లింక్‌లలో దేని ద్వారా అయినా చర్చను వీక్షించేందుకు అవకాశం ఉంది.

https://us04web.zoom.us/j/9601332801?pwd=c3pZa20rZTcyK1hwb0FjS0NNZ200dz09

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*