ఈ నెల 14న తెలంగాణ రాష్ట్రీయ కళామంచ్ ‘నా పాట – నా దేశం’

హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రీయ కళామంచ్ ‘నా పాట – నా దేశం’ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. తెలంగాణ, ఆంధ్రపద్రేశ్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల నుంచి యువ కళాకారులు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి 10 మంది, ఆంధ్ర నుంచి 10 మంది కళాకారులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీఈఆర్‌టీ సభ్యులు పి. మురళీ మనోహర్, సినీ గేయ రచయిత డాక్టర్ కందికొండ, సినీ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకులు రవి వర్మ పాల్గొననున్నారు. ఈ మేరకు కళామంచ్ తెలంగాణ కన్వీనర్ నాగరాజు, ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ నాదముని సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.

ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 14, 15 తేదీలలో జూమ్ యాప్, ఎఫ్‌బీ లైవ్ ద్వారా వీక్షించవచ్చన్నారు. యువతలో జాతీయ స్ఫూర్తి, దేశభక్తిని రగలించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగనుందని నిర్వాహకులు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*