
బెంగళూరు: దేశ వ్యాప్తంగా శ్రీ కృష్ణ జన్మాష్టమిని ఘనంగా జరుపుకున్నారు. భారత్తో పాటు అనేక దేశాల్లో శ్రీ కృష్ణుడి జన్మ దినాన్ని వేడుకగా జరుపుకున్నారు. హైదరాబాద్ రామకృష్ణామఠంతోపాటు దేశంలోని ఇస్కాన్ దేవాలయాలు, అనేక కృష్ణ మందిరాల్లో కన్నుల పండువగా జన్మాష్టమి వేడుకలు జరిగాయి. తల్లిదండ్రులు తమ చిన్నారులను కన్నయ్యగా, రాధగా అలంకరించుకుని మురిసిపోయారు. చిన్ననాటి నుంచే శ్రీ కృష్ణుడి లీలలు, భోదనలు, మహత్యం తెలిసేలా కథలు చెబుతూ తమ చిన్నారులను ప్రోత్సహిస్తున్నారు.
Be the first to comment