వి.ఐ.హెచ్.ఈ ఆధ్వర్యంలో హెల్తీ బాడీ – హెల్తీ మైండ్ ఆన్ లైన్ కోర్సు:

హైదరాబాద్: ఆరోగ్యకరమైన శరీరం, మనసుకోసం వైద్యరంగ నిపుణులతో హైదరాబాద్ రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో హెల్తీ బాడీ – హెల్తీ మైండ్ ఆన్‌లైన్ కోర్సు ప్రారంభం కానుంది. ఈనెల 17 నుంచి 21 వరకు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు ఆన్‌లైన్ ద్వారా ఈ కోర్సును అందిస్తున్నారు. వారణాసి రామకృష్ణ మిషన్‌కు చెందిన స్వామి కృపాకరానంద, హైదరాబాద్‌కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ నరసరాజు, ఆర్థోపెడిక్ డాక్టర్ భరత్ శర్మ, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి, తిరుపతికి చెందిన ఆయుర్వేద డాక్టర్ మురళి కృష్ణ ఈ కోర్సుకు హాజరయ్యేవారికి సలహాలు, సూచనలు ఇస్తారు.

16 సంవత్సరాలకు పైబడిన వారు ఈ కోర్సులో చేరవచ్చని వివేకానంద ఇనిస్టిట్యూట్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరెక్టర్ స్వామి బోధమయానంద తెలిపారు. Hyderabad.vihe@rkmm.org ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*