
రాంచీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా తన రిటైర్మెంట్ ప్రకటించాడు.
ధోనీ రిటైర్మెంట్ను బీసీసీఐ కూడా ధృవీకరించింది.
NEWS : MS Dhoni retires from international crickethttps://t.co/jvTJ4wVmeq#ThankYouMSDhoni 💙 pic.twitter.com/JB6ZxhU6dx
— BCCI (@BCCI) August 15, 2020
భారత క్రికెట్ జట్టుకు మొత్తం 11 సవంత్సరాల పాటు ధోనీ సేవలందించాడు. 2004 డిసెంబర్ 23న ధోనీ తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. విశాఖ సూపర్ ఇన్నింగ్స్‌తో స్టార్‌గా మారాడు. 2007లో ధోనీకి కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చారు. 2014లోనే టెస్టుల నుంచి ధోనీ తప్పుకున్నాడు. 2019 వరల్డ్‌కప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌తో ధోనీ చివరి మ్యాచ్ ఆడాడు. 350 వన్డేల్లో 10,773 పరుగులు చేశాడు. 90 టెస్టుల్లో 4,876 పరుగులు చేశాడు. 98 T-20 మ్యాచ్‌ల్లో 1,617 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధిక స్కోర్ 183 నాటౌట్, టెస్టుల్లో అత్యధిక స్కోర్ 224. ధోనీ టెస్టుల్లో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు చేశాడు. వన్డేల్లో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు చేశాడు. టెస్టుల్లో 256 క్యాచ్‌లు, 38 స్టంపింగ్‌లు, వన్డేల్లో 321 క్యాచ్‌లు, 123 స్టంపింగ్‌లు చేశాడు. టీ-20ల్లో 57 క్యాచ్‌లు, 34 స్టంపింగ్‌లు చేశాడు. 2007లో టీ-20, 2011లో వన్డే వరల్డ్ కప్‌లు, 2013లో ఛాంపియన్ ట్రోఫీ అందుకున్నాడు. 3 ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఒకే ఒక్క కెప్టెన్‌గా ధోనీ రికార్డ్ సాధించాడు. మూడు ఫార్మాట్లలో భారత్‌ను నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ధోనీ నేతతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ 3 సార్లు విజేతగా నిలిచింది.
ధోనీకి గతంలో రాజీవ్ ఖేల్‌రత్న, పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులు వచ్చాయి.
Be the first to comment