సామాజిక బాధ్యత ఉంటేనే రేడియో జాకీ అవ్వాలి: స్వాతి బొలిశెట్టి

హైదరాబాద్: కవయిత్రి.. రేడియో జాకీ అయితే అచ్చం స్వాతి బొలిశెట్టిలా ఉంటుంది. పైకి సాధారణంగా కనిపించే స్వాతి… అసాధారణమైన ముత్యపు చినుకు అని కట్టిపడేసే ఆమె రచన, కవిత్వాల ద్వారా ఇట్టే తెలిసిపోతుంది. యండమూరి, అనంత శ్రీరాం, రమణ గోగుల వంటి ప్రముఖ కవులు, రచయితలతో ప్రశంసలు పొందిన ఆమె ప్రజల హృదయ భాష తెలిసిన రేడియో జాకీ. తన మనసులోని భావాలను ఈక్షణం పాఠకులతో పంచుకునేందుకు స్వాతి బొలిశెట్టి సమయమిచ్చారు.

RJ కావాలని చాలామంది కోరిక. మీరు RJ అవుతారని అనుకున్నారా?

అసలు RJ అనే ఒక ప్రొఫెషన్ ఉంటుందని నాకు తెలీదు. సంగారెడ్డి జిల్లా ఈశ్వరపురానికి చెందిన నేను సరస్వతి శిశు మందిర్‌లో చదువుకున్నాను. ఆ తర్వాత డిగ్రీ చదువుతూ స్కూల్‌లో టీచర్‌గా ( పార్ట్ టైం) వర్క్ చేసేదాన్ని. కానీ, స్కూల్ లైఫ్‌లో జరిగే ఏ చిన్న ప్రోగ్రాం అయినా నేనే డిజైన్ చేసి, హోస్ట్ చేసే దాన్ని. అలా ఆ స్కూల్ ప్రిన్సిపాల్ నువ్వు యాంకర్‌గా ట్రై చెయ్యి మంచి భవిష్యత్ ఉంటుంది అని అంటే ఆ ప్రయత్నంలో ఒక ఫ్రెండ్ ద్వారా జెమిని న్యూస్ ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా సెలెక్ట్ అయ్యాను. ఆడపిల్లని కదా…..ఆన్ స్క్రీన్ వద్దు అన్నారు ఇంట్లో., అదే టైంలో fm లో ఆడిషన్స్ ఉన్నాయని తెలియడంతో అసలు రేడియో జాకీ అంటే ఏమిటో తెలియకుండానే అప్లై చేసాను, సెలక్ట్ అయ్యాను.


ఆల్ ఇండియా రేడియోలో రేడియో జాకీగా చేస్తున్నారు కదా…ఆ అనుభూతి వివరిస్తారా…?

రేడియో జాకీ అంటేనే తెలియకుండానే RJ అయ్యాను. … చాలా కొత్త అనుభూతి నాకు. స్కూల్ లో అన్ని స్టేజ్ ప్రోగ్రామ్స్ హోస్ట్ చేసినా…. ఆ ధైర్యం, ఉత్సాహం ఆ ఒక్క ప్రోగ్రాం వరకు మాత్రమే ఉండేది. ఆ తర్వాత చాలా సైలెంట్ గా ఉండేదాన్ని. అలాంటిది RJ గా వాణి ట్రైనింగ్ అందరితో ముందు మాట్లాడటం నాకు కొంచెం కష్టమే అయింది. పేజీలకు పేజీలు స్క్రిప్ట్ రాసేదాన్ని కానీ…..ప్రెజెంటేషన్ అనగానే గొంతు పేగిలేది కాదు. ఒకసారి ఒకాయన నువ్వు RJ గా సెలెక్ట్ అయ్యావా…, రేడియో లో వార్తలు చదవడానికి వచ్చావా…? అనే సరికి బాగా ఏడ్చేశాను. తర్వాత ఆ సర్ ట్రైనింగ్ లోనే perfect అనిపించుకుని, ఇలా 12 సంవత్సరాలుగా RJ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. మైక్ ముందు కూర్చున్నామంటే అదే ప్రపంచం….ఇంకేం గుర్తుకు రాదు…. సెలెబ్రెటీస్ ని ఇంటర్వ్యూ చేయడం…డాక్టర్లు, రైటర్స్,…. ఇలా రెయిన్‌బో నుంచే ఎక్కువ నేర్చుకున్నాననిపిస్తుంది. మా ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్స్ కూడా చాలా సపోర్టివ్. రాంబాబు, సుమనస్పతి, వసుమతి, కుమార్, రామారావు, కామేశ్వరీ చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. వీరి నుంచి నేర్చుకున్న విషయాలు ఎక్కువే ఉన్నాయి.సీనియర్ ఆర్.జేల సహకారం కూడా చాలా హెల్ప్ అయింది నాకు. ఫస్ట్ టైం అసలు స్క్రిప్ట్ ఎలా రాయాలో 4 లైన్స్ రాసిచ్చి ఎంకరేజ్ చేసింది ఆర్.జే పుష్ప. సాంగ్ సెలెక్షన్ కూడా నేర్చుకుంది ఆర్.జే గీతను చూసి. అన్నట్టు…. నా పెళ్ళి కార్డ్ కూడా…రెయిన్ బో jack tale లాగానే ఉంటుంది.2007 నవంబర్ 21 న నా first show on AIR… సాయంత్రం ప్రోగ్రామ్స్ ఎక్కువ చేసేదాన్ని. ఉత్సాహం ఉరకలెత్తేది. రెయిన్ బో adds….. more colors to my life.


మీకు ఎక్కువ రెస్పాన్స్ వచ్చిన టాపిక్ ఏది., టాపిక్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు?

జనరల్ గా ఆర్.జే లతో మాట్లాడాలనే ఆత్రుత శ్రోతలకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెస్పాన్స్ ఎప్పుడూ మంచిగానే ఉంటుంది. అంతే కాకుండా మేము అడిగే ప్రశ్నలు వారి జీవితాలకు ముడిపడే ఉంటాయి, మరికొన్ని వాస్తవానికి సంబంధించినవే ఉంటాయి కాబట్టి శ్రోతలు ఎక్కువగా మాట్లాడటానికే ఇష్టపడుతారు… ఎక్కువ రెస్పాన్స్…. అంటే….. మీ దగ్గరున్న, తాతల నాటి విలువైన (పాతతరం) సామగ్రి ఏమిటని అడిగినప్పుడు మరియూ మీకు మీ పేరు కాకుండా వేరే ఏదైనా పేరు పెడితే బాగుండు (జోక్ గా) అని అనిపించిందా…అడిగినప్పుడు విపరీతమైన కాల్స్ వచ్చాయి…. ఇలా చాలా ఉంటాయి ప్రస్తుతం సింగిడీ అనే కార్యక్రమం చేస్తున్నాను, తెలంగాణ అంతా ఈ కార్యక్రమం మీద మంచి స్పందన వస్తోంది….


అప్పుడప్పుడు మీరు పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవుతారు కదా….ఎలా అనిపిస్తుంది..?

శ్రోతలతో మాట్లాడుతున్నప్పుడు వివిధ ప్రాంతాల మాండలికాలు, ఆచార సంప్రదాయాలు, పద్ధతులు తెలుసుకోవడం ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు మమ్మల్ని వాళ్ళ కుటుంబ సభ్యులుగా చూడటం, ఒకవారము మా మాట వినిపించకపోయిన మాకోసం వేరే ఆర్.జే లను అడిగి తెలుసుకోవడం ఆనందంగా ఉంటుంది… మాకన్నా వయసులో పెద్దవారు అయినా మేము చెప్పింది విని, చాలా బాగా చెప్పారు, మీ వలన చాలా నేర్చుకున్నాము అని చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది.


మీకు ఫ్యాన్స్ ఉంటారుగా….ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది?

ఫ్యాన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు..అందులోనూ మమ్మల్ని చూడకుండా, కేవలం మా గొంతువిని మమ్మల్ని అభిమానించే వారంటే మాకు చాలా గౌరవం. ఒక కాలర్(పెద్దావిడ) టాపిక్ మాట్లాడను, మీతోనే మాట్లాడటానికి చేసాను అంటుంది….నా ప్రెగ్నెన్సీ సమయంలో చీర, పచ్చళ్ళు చాలా పంపించింది…. నా షోలు అన్ని రికార్డ్ చేసి నాకే గిఫ్ట్ గా పంపించారు…. కాలర్ స్టార్ట్ అయి కుటుంబ స్నేహితులుగా మారిన రెండు కుటుంబాలు కూడా ఉన్నాయి….ఇవన్నీ కూడా విలువైన బహుమతులే…. వీరందరినీ ఎప్పుడు డైరెక్టుగా కలిసింది లేదు, వీరి అభిమానమే ఇప్పటికి రేడియో లో కొనసాగేలా చేస్తోంది…


మిమ్మల్ని చూసే అవకాశం లేదు కదా, మీ వాయిస్ ద్వారా మిమ్మల్ని గుర్తుపట్టారా?

మాకు శ్రోతలకు మధ్య రిలేషన్ ఏర్పరచినదే మా గొంతు….ఈజీగా మమ్మల్ని గుర్తించగలరు. ఒక్కొక్క ఆర్.జే కి ఒక్కొక్క ఊతపదం బట్టి గుర్తుపట్టేస్తారు… ఎలా ఉన్నారు అంటే చాలా చక్కగా ఉన్నాను అంటాను నేను, కాబట్టి మా చక్కని స్వాతి అని గుర్తుపడతారు.


మీ మర్చిపోలేని ప్రశంస ఏమిటీ?

మ్యూజిక్ డైరక్టర్ రమణ గోగుల రెయిన్ బోకి నువ్వు లైబ్రరీ అని కొనియాడటం…..గీత రచయిత అనంత శ్రీరాం గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ పదాల్లో కొత్తదనం ఉంది, మీరు రాయండి గొప్ప రచయిత్రి అవుతారు అన్నారు. ఆయన మాటల బలమో ఏమో నేను వ్రాసిన ఒక కవితకు సమీక్షించడం మర్చిపోలేనిది… ఇటీవల నేను రాసిన కవితకు యండమూరి ప్రశంస మర్చిపోలేనిది….మా కోసం ఒక కవిత ప్లీజ్?

ఊహకి – వాస్తవానికి మధ్య దూరం నువ్వూ-నేను

కదిలే కాలానికి – కరిగే క్షణాలకి మధ్య వారధి నువ్వూ-నేను

కనిపించని బంధమేదో కట్టిపడేసినా ఎప్పటికీ కలవని తీరాలం మనం అయితేనేం…….

కాల ప్రవాహంలో నీ జ్ఞాపకాలు
నిన్ను – నన్ను కలిపే ఉంచుతాయి.

మా కోసం మరో కవిత ప్లీజ్…

అహం….
మమకారాన్ని దురం చేసే అజ్ఞానం
అంతా నాకే తెలుసన్న మిడి మిడి విజ్ఞానం
అహం………
చికిధ్స లేని జబ్బు
కమ్ముకుంటే వీడని మబ్బు.
అహం…….
పొగిడితే కాలర్ ఎగరేస్తుంది
విమర్శిస్తే అదే కాలర్ పట్టుకుంటుంది.
అంతటా నేనె…
అంతా నాదే అంటుంది.

నిమిషాలలో రాజుని చేస్తుంది
క్షణాల్లో బంటుగా మారుస్తుంది
కళ్ళున్న ధృతరాష్టూడి వో
చెవులున్న చెవిటి వాడి వో
అర్థ0గాని అయోమయ0 లో
పడదోస్తుంది….

అహం….
అందనంత ఎత్తుకు మోస్తుంది
అంతలొనే ..
అథపాతాళానికి తొక్కేస్తుంది.
నిన్ను.. అందరున్న ఏకాకిని చేస్తుంది.
ఇదే అహం ..నీలో ..నాలో నిండిపోయింది..
అందుకే…
అహం బ్రహ్మశ్మి అంటాం..
అహం లేని వాడు బ్రహ్మజ్ఞాని అని తెలుసుకోలే0..

మీ భవిష్యత్ ప్రణాళిలు చెబుతారా?

టెక్నాలజీ పరంగా బాగా డెవలప్ అయ్యామని, అన్ని రంగాలలో రాణిస్తున్నామని చెప్పుకుంటున్నా కూడా ఆడపిల్లల విషయంలో కనిపించని వివక్ష అయితే ఇంకా ఉంది…. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి భవిష్యత్తులో ఆసరాగా ఏమైనా చేయాలనే కోరికైతే బలంగా ఉంది…..

RJ కాకపోతే ఏమి చేసేవారు?

RJ కాకపోతే నిస్సందేహంగా టీచర్ లేదా లాయర్ అయ్యేదాన్ని..

RJ కావాలనుకునే వారికి మీరిచ్చే మెసేజ్ ఏమిటి?

వాయిస్ pleasent గా ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి, సమాజంలో జరుగుతున్న విషయాలపై మీద అవగాహన ఉండాలి, మైక్ ముందు కూర్చుని 3 మాటలు, 6 పాటలు వేసేస్తే చాలు అని అనుకోకూడదు…. ఆర్.జే వృత్తి అనేది ఒక ఫ్యాషన్‌గా కాకుండా ఒక భాధ్యతగా నిర్వర్తించాలి.

-మంజీత బందెల(ఈక్షణం జర్నలిస్ట్, బెంగళూరు),
-విజయ్ కొత్తూరు (ఈక్షణం జర్నలిస్ట్, విజయవాడ 94934 39425).

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*