
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇంతలోనే ఆసుపత్రిలో చేరాల్సి రావడంతో ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఇంటి వద్దే ఉంటూ డాక్టర్ల సలహాలు పాటించారు. నెగెటివ్ వచ్చినా డాక్టర్ల సలహా మేరకు హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఆరోగ్య పరంగా ఇబ్బందులు తలెత్తడంతో ఆయన్ను న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నాక ఆయన జెండావందనం కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.
‘स्वतंत्रता दिवस’ के अवसर पर अपने आवास पर ध्वजारोहण किया।
आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएँ। pic.twitter.com/kfmtRhRIuC
— Amit Shah (@AmitShah) August 15, 2020
Be the first to comment