7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు సన్నాహాలు

సింగపూర్: ఈ ఏడాది అక్టోబర్ 10-11తేదీల్లో దక్షిణాఫ్రికాలోని జొహాన్స్‌ బర్గ్‌లో 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు జరగనుంది. జూమ్ వీడియో ద్వారా నిర్వహింపబడే ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషా, సాహిత్యాభిమానులకు, పండితులకు, రచయితలకు, వక్తలకు వంగూరి ఫౌండేషన్ స్వాగతం పలుకుతోంది.

ఈ ప్రతిష్టాత్మక సదస్సు అంతర్జాలం ద్వారా 24 గంటలు, నిర్విరామంగా న్యూజీలండ్ నుంచి అమెరికా దాకా జరుగుతుంది. గత 14 ఏళ్ళలో 4 ఖండాలలో ఉన్న 5 దేశాలలో ప్రపంచ సాహితీ సదస్సులు జరిగాయి. హైదరాబాద్, అమెరికాలోని హ్యూస్టన్, బ్రిటన్‌లోని లండన్, సింగపూర్, ఆస్త్రేలియాలోని మెల్‌బోర్న్‌లో దిగ్విజయంగా జరిగిన ప్రపంచ సాహితీ సదస్సుల పరంపరను ఈ కరోనా సమయంలో కూడా కొనసాగించాలని నిర్ణయించారు.

ఈసారి జరిగే 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు జొహాన్స్‌ బర్గ్‌‌ ప్రధాన కేంద్రంగా అంతర్జాలం ద్వారా నిర్వహిస్తారు. ఆఫ్రికా ఖండంలో తొలి సాహితీ సదస్సుగా, తెలుగు సాహిత్య చరిత్రలో మరొక సారి నూతన అధ్యాయాన్ని సృష్టించబోతోంది.

పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని వంగూరి ఫౌండేషన్ తెలిపింది. మరిన్ని వివరాలకు వంగూరి చిట్టెన్ రాజు 1 832 594 9054 వాట్సాప్ నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*