స్వామి బోధమయానంద ఆధ్వర్యంలో గైడెడ్ మెడిటేషన్ క్లాసులు

హైదరాబాద్: రామకృష్ణ మఠంలోని ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ ఆధ్వర్యంలో ‘గైడెడ్ మెడిటేషన్’ పేరిట ఆన్‌లైన్ ధ్యాన తరగతులు నిర్వహించనున్నారు. ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 21 వరకు 21 రోజుల పాటు ఈ తరగతులు నిర్వహిస్తారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 7.30 నుంచి 8.00 గంటల వరకు క్లాసులు ఆన్ లైన్‌లో జరుగుతాయి. 16 ఏళ్ల పైబడిన అందరూ ఈ తరగతులకు అర్హులు. మెదడు పనితీరు మెరుగవ్వాలన్నా.. ఒత్తిడి లేని జీవితం గడపాలన్నా.. సంతోషంగా ఉండాలన్నా.. వీటన్నింటికీ పరిష్కారం ధ్యానమే. ఏకాగ్రతా రహస్యం, ఆలోచనల నియంత్రణ, ఒత్తిడిని తగ్గించుకోవడమెలా.. వంటి అంశాలు ఈ క్లాసులలో నేర్పించనున్నరని స్వామి బోధమయానంద తెలిపారు. స్వామీజీ స్వయంగా ధ్యానతరగతులకు శిక్షణ ఇవ్వనున్నారు.

ఆర్‌కే మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు.

మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు. రామకృష్ణ మఠం పని వేళలు : ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు; సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*