కోవిడ్ వేళ యూరప్ స్టైల్ వదిలి నమస్తేతో విష్ చేసుకుంటోన్న అగ్రరాజ్యాధినేతలు

పారిస్: కోవిడ్ వేళ అగ్రరాజ్యాధినేతలు యూరప్ స్టైల్‌కు స్వస్తి చెప్పి భారతీయ పద్ధతి ప్రకారం విష్ చేసుకుంటున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కలుసుకున్నప్పుడు చేతులు జోడించి నమస్కారం చెప్పుకున్నారు. మెర్కెల్‌ మిగతా వారికి కూడా నమస్కారం చెప్పారు. దూరంగా నిల్చున్నారు. ఈ దృశ్యాన్ని మ్యాక్రాన్ తన ట్విటర్‌లో షేర్ చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా భారతీయ పద్ధతిని అలవరచుకున్నారు. నమస్కారం చెబుతూ అందరినీ విష్ చేస్తున్నారు.

యూరప్, అమెరికాలో ఇద్దరు వ్యక్తులు కలవగానే చేతులతో షేక్ హ్యాండ్ ఇవ్వడం, బుగ్గలను ఆన్చడం, బుగ్గలపై ముద్దు పెట్టుకోవడం, హత్తుకోవడం చేస్తుంటారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాధి నేతలు భారత్ పద్ధతిని అలవాటు చేసుకున్నారు. నమస్కారం చెప్పడం హుందాగా కూడా ఉంటుండటంతో నమస్కారం చెబుతూ చిరునవ్వులు చిందిస్తున్నారు.

మిగతా ప్రపంచ దేశాల సంగతి ఎలా ఉన్నా భారత్‌లో కరోనా వేళ నేతలతో పాటు ప్రజలు కూడా పరస్పరం నమస్కరించుకుంటూ పలకరించుకుంటున్నారు. షేక్‌హ్యండ్‌కు పూర్తిగా స్వస్తి చెప్పి అప్రమత్తంగా ఉంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*