మరోసారి ఉదారత చాటుకున్న జీవై ఫౌండేషన్

హైదరాబాద్: శేరిలింగంపల్లి బీజేపీ ఇంఛార్జ్ గజ్జల యోగానంద్ నేతృత్వంలోని జీవై ఫౌండేషన్ మరోసారి ఉదారత చాటుకుంది. భారత స్వతంత్ర దినోత్సవాల సందర్భంగా జీవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు టిఫిన్ బాక్సులను పంచారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అనేక పేద కుటుంబాలకు టిఫిన్ బాక్సులు అందజేసినట్లు ఫౌండేషన్ కార్యకర్త కూర శ్రీనివాస్ తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ఏ సాయమూ అందక ఇబ్బందులు పడుతున్నవారికి తమ ఫౌండేషన్ అండగా నిలిచిందన్నారు.

హైదరాబాద్‌లో పలు చోట్ల గత ఐదు నెలలుగా సుమారు 50,000 మంది నిరుపేదలకు నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, వంట నూనెతో పాటు మందులు, మాస్కులు, శానిటైజర్లు పెద్దఎత్తున అందించినట్టు జీవై ఫౌండేషన్ ప్రతినిధులు వివరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*