
హైదరాబాద్: శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 9 మంది చనిపోయారు. మృతుల్లో డీఈఈ, ఆరుగురు ఏఈలు, ఇద్దరు అమరరాజ కంపెనీ ఉద్యోగులున్నారు. ఆరుగురి మృతదేహాలు జెన్కో ఆస్పత్రికి తరలించారు.
మృతుల వివరాలు
………………………..
డీఈఈ శ్రీనివాసరావు (హైదరాబాద్),
ఏఈ సుందర్ (సూర్యాపేట)
ఏఈ కుమార్(హైదరాబాద్),
ఏఈ సుష్మ(హైదరాబాద్)
ఏఈ ఫాతిమా(హైదరాబాద్),
ఏఈ వెంకట్రావు (పాల్వంచ)
ఏఈ మోహన్ (హైదరాబాద్),
అమరరాజ ఉద్యోగులు రాంబాబు, కిరణ్
మరోవైపు శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా సీఐడీ అడిషనల్ డీజీపీ గోవింద్‌సింగ్‌ను నియమించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరారు. ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై మంత్రి జగదీష్‌రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో సీఎం మాట్లాడారు.
శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై సిఐడి విచారణకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు బయటకు రావాలని సీఎం స్పష్టం చేశారు.
— Telangana CMO (@TelanganaCMO) August 21, 2020
Be the first to comment