
హైదరాబాద్: రామకృష్ణ మఠంలోని ‘వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స్’ ఆధ్వర్యంలో ‘వివేకానంద బాలవికాస్ కేంద్రం’ ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్టు ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 30 నుంచి నవంబర్ 29 వరకు 53 రోజుల పాటు ఈ తరగతులు నిర్వహిస్తారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజు తప్పించి రోజు ఉదయం 7.00 నుంచి 8.00 గంటల వరకు క్లాసులు ఆన్ లైన్లో జరుగుతాయి. ఆదివారాలలో ఉదయం 8.30 నుంచి 10.00 వరకు ఆన్ లైన్ క్లాసులు ఉంటాయని ‘వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స్’ డైరక్టర్ స్వామి బోధమయానంద తెలిపారు. 4వ తరగతి నుంచి 10 తరగతి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అందరూ ఈ క్లాసులకు అర్హులేనని ప్రకటనలో తెలిపారు. నైతిక, ఆధ్యాత్మిక విలువలు, భజనలు, మంత్రాలు, యోగాసనాలు, జపధ్యానాదులలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.
రామకృష్ణ మఠంలో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు.
మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.
రామకృష్ణ మఠం పని వేళలు : ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు; సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు.
Be the first to comment