సింగపూర్‌ వాసవి క్లబ్ సింగపూర్ ఆధ్వర్యంలో గణపతి అథర్వ శీర్ష హోమం, వ్రతం

సింగపూర్: వాసవి క్లబ్ సింగపూర్ ఆధ్వర్యంలో వినాయక చవితి గణపతి అథర్వ శీర్ష హోమము మరియు వ్రతం నిర్వహించారు. జూమ్ కాల్‌ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో 50 కుటుంబాలు పాల్గొన్నాయి.కడప జిల్లా చిలంకూర్‌లో నివసిస్తున్న సుబ్బరాయ శర్మ స్థానిక అయ్యప్ప స్వామి గుడిలో కరోనా మహమ్మారి నివారణార్థం గణపతి అథర్వ శీర్ష హోమము జరిపించారు. సింగపూర్‌లో నివసిస్తున్న వైశ్యులందరు వెబ్ ద్వారా అయ్యప్ప స్వామి గుడిలో జరిగే కార్యక్రమాన్ని లైవ్ జూమ్ కాల్‌లో తిలకించి సంతోషించారు, తరువాత వారివారి ఇళ్లలో గణపతి ప్రతిమలను తాయారు చేసుకొని వ్రతం ఆచరించారు. సుబ్బరాయ శర్మ వ్రతం, వ్రత కథ వర్ణిస్తూ అందరినీ సమన్వయం చేసుకుంటూ ఆనందోత్సాహాల మధ్య జరిపించారు. కార్యక్రమంలో గణపతి స్తోత్రాలు, కీర్తనలు ఆలపించిన వారిలో లక్ష్మి హాసిని, కాసుల అర్జున్, మురళి, మాధవి, పద్మజ, హవీష్, శ్రీ ముక్తి, మృదుల, కిరణ్ అప్పన్న ఉన్నారు.

వాసవి క్లబ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ గొట్లూరు మాట్లాడుతూ కోవిడ్ సందర్బంగా ఉన్న పరిమితులను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాన్ని వైశ్యులందరు వారివారి ఇంటినుంచే జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి మాట్లాడుతూ ఖండాంతరాల్లో నివసిస్తున్నా అందరు గుడిలో ఉండి చేసినట్లే అనుభూతి చెందారని చెప్పారు. వైశ్యులు ధర్మ పరమైన మరియు సేవాపరమైన కార్యక్రమాల్లో ఎల్లవేళలా ముందుండి సమాజాన్ని చైతన్యంగా ఉంచాలని కోరుకున్నారని చెప్పారు. కమిటీ కోర్ సభ్యులు ముకేశ్ భూపతి, రాజశేఖర్ గుప్త, ముక్కా కిషోర్, మురళి పబ్బతి తదితరులు కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు కృషి చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*