
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలు స్వీకరించేందుకు మరోమారు నిరాకరించారు. దీంతో సోనియాయే మరికొంత కాలం పార్టీ చీఫ్‌గా కొనసాగనున్నారు. ఆరు నెలల్లో పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు మరోమారు కీలక సమావేశం కావాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.
Members expressed faith in Sonia Gandhi & Rahul Gandhi & urged her to continue leading party, she agreed. Next meeting to be called soon, probably within 6 months, to elect new chief. Till then, Sonia Gandhi agreed to remain interim president: PL Punia, Congress Working Committee pic.twitter.com/hQPD6o8w1L
— ANI (@ANI) August 24, 2020
There is no different opinion on leadership and even Ghulam Nabi Azad ji, Mukul Wasnik ji and Anand Sharma ji have given in writing that there is no dispute on leadership: Congress leader and CWC (Congress Working Committee) member, KH Muniyappa https://t.co/a3a0yv6f3g
— ANI (@ANI) August 24, 2020
ఇవాళ జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం వాడీవేడిగా సాగింది. అధ్యక్ష మార్పు తథ్యమని అంతా అంచనాలు వేయగా చర్చంతా పార్టీ నాయకత్వ మార్పు కోరుతూ కొందరు సీనియర్ నేతలు లేఖలు రాశారనే అంశంపై జరిగింది. కొందరు సీనియర్ నేతలు బీజేపీ తొత్తుల్లా వ్యవహరించారంటూ రాహుల్ గాంధీ సీడబ్ల్యూసీ సమావేశంలో వ్యాఖ్యానించారని తొలుత కథనాలు వెలువడ్డాయి. అయితే రాహుల్ చేసిన వ్యాఖ్యలు తమను ఉద్దేశించి చేసినవి కావని కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్ తెలిపారు. తొలుత రాహుల్ వ్యాఖ్యలపై కపిల్ సిబల్ మండిపడ్డా తర్వాత తనకు రాహుల్ ఫోన్ చేశారంటూ ట్వీట్ డిలీట్ చేశారు. ఆజాద్ కూడా రాహుల్ చేసిన వ్యాఖ్యలు తనను ఉద్దేశించి చేసినవి కావని నేషనల్ మీడియాతో అన్నారు.
ఇది ఇలా ఉంటే ఆజాద్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంకెంత కాలం కాంగ్రెస్ పార్టీకి బానిసగా ఉంటావని ప్రశ్నించారు. ముస్లిం నేతలు కాంగ్రెస్ పార్టీకి బానిసలుగా బతకడం మానుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాదు గతంలో ఆజాద్ తమను బీజేపీ బీ టీం అంటూ ఎగతాళి చేసేవారని, ప్రస్తుతం కాంగ్రెస్ నాయకత్వమే ఆజాద్‌ను బీజేపీ ఏజెంట్ అని ఆరోపిస్తోందని అసద్ గుర్తు చేశారు.
Be the first to comment