
హైదరాబాద్: రాజ్‌భవన్ చారిత్రక దర్బార్ హాల్లో గత మూడు రోజులుగా పూజలందుకుంటున్న గణేశుడి విగ్రహాన్ని ఈ రోజు సాయంత్రం నిమజ్జనం చేశారు. నిమజ్జనానికి ముందు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్, ఆమె భర్త ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా. సౌందరరాజన్‌తో కలిసి దర్బార్ హాల్లో వేసిన మంటపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడు రోజులుగా గవర్నర్ దంపతులు రోజూ ఈ మంటపంలో గణేశునికి పూజలు నిర్వహిస్తున్నారు.
#GaneshChaturthi2020 pic.twitter.com/4InB3YFeU1
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) August 24, 2020
ఈరోజు జరిగిన పూజలో గవర్నర్ దంపతులతో పాటు గవర్నర్ సెక్రటరి కె. సురేంద్ర మోహన్, జాయింట్ సెక్రటరీలు జె. భవానీ శంకర్, సి.ఎన్. రఘుప్రసాద్, అనుసంధాన అధికారి సి.హెచ్. సీతారాములు, డా. కె. రాజారాం, పోలీసు అధికారులు, రాజ్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు.
రాజ్ భవన్ ఆవరణలోని ఫిష్ పాండ్‌లో గణేశ నిమజ్జనం చేశారు.
Vinayagar pooja and Nimajjanam…3rd day worshipping and taking to immersion in the lake inside #Rajbhavan #Hyderabad #Telangana#TelanganaGovernor #DrTamilisaiSoundararajan#GaneshChaturthi2020 pic.twitter.com/qMHkOP1epI
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) August 24, 2020
Be the first to comment