
చెన్నై: కరోనాతో చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకున్నారని, ఆయనకు నెగెటివ్ వచ్చిందని కుమారుడు ఎస్పీ చరణ్ చెప్పినట్లుగా వార్తలు వెలువడ్డాయి. తన తండ్రి కోసం ప్రార్ధిస్తున్న అభిమానులకు చరణ్ ధన్యవాదాలు తెలిపినట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే తన తండ్రి ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని, సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు వదంతులే అని ఎస్పీ చరణ్ స్పష్టం చేశారు. డాక్టర్లతో మాట్లాడి సాయంత్రం పూర్తి వివరాలు వెల్లడిస్తానంటూ వీడియో పోస్ట్ చేశారు.
బాలు కోలుకోవాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ప్రార్ధనలు చేశారు. తెలుగు, తమిళ, హిందీ నటులు, సినీ గాయకులు, ప్రముఖులు ప్రార్ధించారు.
సిరివెన్నెల, రజినీకాంత్, ఇళయరాజా సహా పలువురు సినీ ప్రముఖులు బాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
బాలు అన్నయ్యకి నా విన్నపం…#GetWellSoonSPB pic.twitter.com/fxvQ66xDWc
— Sirivennela Official (@sirivennela1955) August 18, 2020
Get well soon dear Balu sir pic.twitter.com/6Gxmo0tVgS
— Rajinikanth (@rajinikanth) August 17, 2020
சீக்கிரம் எழுந்து வா பாலு…
இளையராஜா#SPBalasubramaniam pic.twitter.com/qZ0QGogyfv— Arvind Gunasekar (@arvindgunasekar) August 14, 2020
సింగర్ సునీత కూడా బాలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు.
మెగాస్టార్ చిరంజీవి కూడా బాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
GET WELL SOON #SPB garu! pic.twitter.com/5AV9mf7pEw
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 18, 2020
Be the first to comment