
హైదరాబాద్: స్వామి వివేకానంద స్ఫూర్తితో లక్షలాది మందిని తీర్చిదిద్దిన ‘వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ 21వ వసంతంలోకి అడుగు పెడుతోంది. హైదరాబాద్ రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ రెండు దశాబ్దాలుగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా యువతను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు వ్యక్తిత్వ వికాసం, యోగా తదితర కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఆత్మ విశ్వాసం పెంపొందింప చేసే తరగతులు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునే తరగతులు నిరంతరం నిర్వహిస్తోంది.
— Swami BODHAMAYANANDA (@SwamiBODHAMAYA3) August 7, 2020
సేవలో తరించడం ఎలాగో కూడా ప్రాక్టికల్‌గా నేర్పిస్తున్నారు. భగవద్గీత సందేశాన్ని నిరంతరం యువతకు అందిస్తున్నారు. పరిపూర్ణత దిశగా యువతను మేల్కొల్పడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం.
బాల్ వికాస్ కేంద్ర ద్వారా విఐహెచ్ఈ చిన్నారులకు మార్గదర్శిగా నిలుస్తోంది. 21వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సెప్టెంబర్ 10న విఐహెచ్ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ డైరక్టర్ స్వామి బోధమయానంద తెలిపారు.
ఈ వర్చువల్ సమావేశానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతున్నారు. విద్యార్థులను, యువతను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని రామకృష్ణ మఠ్ ఫేస్ బుక్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో చూడొచ్చు.
Be the first to comment