రియా నా కుమారుడికి విషమిచ్చి చంపింది: సుశాంత్ తండ్రి

ముంబై: తన కుమారుడికి అతడి ప్రియురాలు, నటి రియా చక్రవర్తి విషమిచ్చి చంపిందని నటుడు సుశాంత్ సింగ్ రాథోడ్ తండ్రి కేకే సింగ్ ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు రియాను, ఆమె సహచరులను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రియా చక్రవర్తిపై కేసు పెట్టారు.

సుశాంత్ సింగ్ అకౌంట్ల నుంచి రియా చక్రవర్తికి, ఆమె కుటుంబ సభ్యులకు డబ్బు ట్రాన్స్‌ఫర్ అవడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కూడా ఆమెపై ఇప్పటికే కేసు నమోదు చేసింది. రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తికి కూడా ఈడీ సమన్లు పంపింది.

అటు సుశాంత్ స్నేహితుడు సిద్ధార్ధ్ పిఠానీని, సుశాంత్ వంట మనిషి నీరజ్ సింగ్‌ను, రియా సోదరుడు షోవిక్ చక్రవర్తిని సీబీఐ అధికారులు వేర్వేరుగా విచారిస్తున్నారు. వీరినుంచి కీలక సమాచారం రాబట్టారు.

పూర్తి ఆధారాలు సేకరించకుండా రియాను అరెస్ట్ చేస్తే సులభంగా బెయిల్ వస్తుందని, పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించాలని సుశాంత్ తరపున కేసు వాదిస్తున్న న్యాయవాది వికాస్ సింగ్ సూచించారు.

జూన్ 14న సుశాంత్ సింగ్ ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కేసును తొలుత విచారించిన ముంబై పోలీసులపై తమకు నమ్మకం లేదంటూ సుశాంత్ కుటుంబ సభ్యులు ప్రధానికి, బీహార్ సీఎంకు చెప్పారు. సీబీఐకి అప్పగించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*