నాటా ప్రపంచ స్థాయి ఆర్ట్ పోటీలు… విజేతలకు నగదు బహుమతులు

వాషింగ్టన్: అమెరికాలోని నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ ఎంతో మంది ప్రతిభావంతులను,కొత్త వారిని ప్రోత్సహిస్తూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది.అందులో భాగంగా,ప్రపంచ స్థాయి ఆర్ట్ పోటీలను నిర్వహిస్తోంది.

తెలుగు వారి కోసం వర్చువల్ గా జరగబోతున్న ఈ పెయింట్ పోటీలలో పాల్గొనదలచిన వారు సెప్టెంబర్ 7 వ తేదీ లోగా తమ పేరును నాటా వారి వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకొనవలసిందిగా తెలిపారు.

ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ బహుమతిగా 500 డాలర్లు,రెండవ బహుమతిగా 400 డాలర్లు,మూడవ బహుమతిగా 300 డాలర్లు ,మరో ఏడుగురికి 100 డాలర్ల చొప్పున బహుమతిని ప్రధానం చేయనున్నారని,నాటా తరుపున డా.ఆనంద్,లక్ష్మి నందూరి తెలిపారు. For Rules & Registration visit https://www.nataus.org/art2020

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*