
ప్రధానమంత్రి జన్-ధన్ యోజన (పిఎంజెడివై) – ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం ప్రారంభించిన జాతీయ స్థాయి కార్యక్రమం అమలు ఆరు సంవత్సరాలు పూర్తి
మోదీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం లక్ష్యంగా చేపట్టిన ఆర్థిక కార్యక్రమాలకు పునాది రాయి – ఆర్థికమంత్రి
ప్రారంభం నుంచి 40.35 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు బ్యాంకింగ్ సదుపాయం. రూ.1.31 లక్షల కోట్ల డిపాజిట్లు;
63.6% గ్రామీణ పిఎంజెడివై ఖాతాలు; 55.2% మహిళా జెడివై ఖాతాలు
పిఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద ఏప్రిల్-జూన్ 2020 నెలల మధ్య కాలంలో మహిళా పిఎంజెడివై ఖాతాదారుల ఖాతాల్లో రూ.30,705 కోట్లు జమ
వివిధ పథకాల కింద ప్రభుత్వం అందించే సహాయంగా 8 కోట్ల పిఎంజెడివై ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి)
ఇంతవరకు సమాజంలో నిరాదరణకు, సామాజికంగా-ఆర్థికంగా నిరాకరణకు గురవుతున్న వర్గాలకు మద్దతు ఇచ్చి ఆర్థిక కార్యకలాపాల్లో అందరినీ భాగస్వాములను చేయడానికి ఆర్థికమంత్రిత్వ శాఖ కట్టుబడింది. సమ్మిళిత వృద్ధికి దోహదపడే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ (ఆర్థిక కార్యకలాపాల్లో అందరి భాగస్వామ్యం) ప్రభుత్వ జాతీయ ప్రాధాన్యత. వ్యవస్థీకృత ఆర్థిక వ్యవస్థలోకి పేద వర్గాల పొదుపు పెట్టుబడులు తేవడం ద్వారా వారికి ఆదాయ వనరు అందుబాటులోకి తేవడం అత్యంత ప్రధానం. అవసరం ఏర్పడినప్పుడు తమ ఖాతాల్లో నుంచి సొమ్ము ఉపసంహరించుకునే ఆదాయవనరు అందుబాటులో ఉంచడం వల్ల ఆ కుటుంబాలు అవాంఛనీయ వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకోకుండా ఉంటారు. ఈ హామీ నెరవేర్చే దిశగా చేపట్టిన ప్రధాన కార్యక్రమమే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. ప్రపంచంలోని అతి పెద్ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కార్యక్రమాల్లో ఇదొకటి.
Today, six years ago, the Pradhan Mantri Jan Dhan Yojana was launched with an ambitious aim of banking the unbanked. This initiative has been a game-changer, serving as the foundation for many poverty alleviation initiatives, benefitting crores of people. #6YearsOfJanDhanYojana pic.twitter.com/MPueAJGlKw
— Narendra Modi (@narendramodi) August 28, 2020
2014 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిఎంజెడివైని ప్రకటించారు.
प्रधानमंत्री जन धन योजना से गरीब से गरीब लोगों, वंचितों व जरुरतमंदों को मिली को बैंकिंग की सुविधा। इसके तहत कुल 40.35 करोड़ खाते खोले गए, जिनमें 55% से अधिक खाताधारक महिलाएं हैं। #6YearsOfJanDhanYojana @PMOIndia @FinMinIndia @PIB_India @MIB_India @nsitharaman @ianuragthakur pic.twitter.com/9RaHhlCD4v
— MyGovIndia (@mygovindia) August 28, 2020
అదే నెల 28వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ విషవలయం నుంచి పేదలు విముక్తులవుతున్న పర్వదినంగా దీన్ని నిర్వహించుకోవాలని ప్రధానమంత్రి అన్నారు.
Thanks to the Pradhan Mantri Jan Dhan Yojana, the future of several families has become secure. A high proportion of beneficiaries are from rural areas and are women. I also applaud all those who have worked tirelessly to make PM-JDY a success. #6YearsOfJanDhanYojana pic.twitter.com/XqvCxop7AS
— Narendra Modi (@narendramodi) August 28, 2020
పిఎంజెడివై 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆ పథకం ప్రాధాన్యతను పునరుద్ఘాటిస్తూ “మోదీ ప్రభుత్వం ప్రజాసంక్షేమ లక్ష్యంతో చేపట్టిన ఆర్థిక కార్యక్రమాలకు పునాది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన” అన్నారు. “ప్రత్యక్ష నగదు బదిలీ కావచ్చు, కోవిడ్-19 ఆర్థిక సహాయం, పిఎం-కిసాన్, ఎంజిఎన్ఆర్ఇజిఏ వేతనాల పెంపు, జీవిత/ ఆరోగ్యబీమా కవరేజి కల్పన, యువజనుల్లో ప్రతీ ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు అందించడంలో తొలి అడుగు వంటి పిఎంజెడివై నిర్దేశిత లక్ష్యాలన్నీ ఇంచుమించుగా పూర్తయ్యాయి” అని ఆమె చెప్పారు.
#PradhanMantriGaribKalyanPackage for #PMJDY women beneficiaries:
➡️amount of Rs. 500 per month for 3 months (Apr’20-Jun’20), was credited to women account holders under PMJDY
➡️A total of Rs. 30,705 cr credited in accounts of women PMJDY account holders during Apr-Jun, 2020
(7/7) pic.twitter.com/YIIBqyNMwZ— Ministry of Finance (@FinMinIndia) August 28, 2020
ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఈ సందర్భంగా పిఎంజెడిడైపై తన ఆలోచనలు పంచుకున్నారు. “ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో పిఎంజెడివై బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో లేని వారిని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చింది. భారత ఆర్థిక నిర్మాణాన్ని విస్తరించింది. 40 కోట్ల మందికి పైగా ఖాతాదారులకు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కల్పించింది. ఈ పథకం లబ్ధిదారుల్లో అధిక సంఖ్యలో మహిళలే ఉన్నారు. గ్రామీణ ఖాతాలే ఇందులో అత్యధికం” అని ఆయన చెప్పారు. “నేటి కోవిడ్-19 కల్లోలిత సమయంలో సమాజంలో సరైన రక్షణ లోపించిన కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం, సాధికారత సాధన డిబిటి ద్వారా ఎంత వేగంగా, నిరంతరాయంగా సాధించామో మనం కళ్లారా చూశాం. పిఎం జన్ ధన్ ఖాతాల ద్వారా నిర్వహించిన డిబిటి ప్రభుత్వం అందించిన ప్రతీ ఒక్క రూపాయి లబ్ధిదారులకు నేరుగా చేరడానికి భరోసాగా నిలిచింది. వ్యవస్థాత్మకమైన లీకేజిలకు అడ్డుకట్ట వేసింది” అన్నారు.
Pradhan Mantri Jan Dhan Yojana has brought in financial inclusion in India in an unprecedented scale. It was on this day six years ago.
#6YearsOfJanDhanYojana https://t.co/EYmpGZPBIB
— Nirmala Sitharaman (@nsitharaman) August 28, 2020
ఈ పథకం విజయవంతంగా అమలుజరిగి 6 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఇప్పటివరకు ఈ స్కీమ్ సాధించిన విజయాలు, ప్రధానాంశాలు ఒక సారి మననం చేసుకుందాం.
PMJDY: Powering India’s Financial Inclusion drive by ensuring access of financial products & services at an affordable cost.#6YearsOfJanDhanYojana #PMJDY #AatmanirbharBharat@PMOIndia @FinMinIndia @PIB_India pic.twitter.com/NasFO13K5g
— DFS (@DFS_India) August 28, 2020
పూర్వాపరాలు
ప్రజలందరికీ భరించగల స్థాయిలో ఆర్థిక సర్వీసులు ప్రత్యేకించి బ్యాంకింగ్/ సేవింగ్స్, డిపాజిట్ ఖాతాలు, చెల్లింపులు, నగదు జమలు, రుణం, బీమా, పెన్షన్ సేవలు అందుబాటులో ఉంచడం లక్ష్యంగా చేపట్టిన జాతీయ స్థాయి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కార్యక్రమం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పిఎంజెడివై).
1. లక్ష్యాలు
– భరించగల వ్యయాల్లో ఆర్థిక ఉత్పత్తులు సేవలు అందరికీ అందుబాటులో ఉంచడం
– వ్యయాలు తగ్గించి, విస్తృతిని పెంచడం కోసం టెక్నాలజీ వినియోగం
2. ఈ స్కీమ్ ప్రధానాంశాలు
– ఇంతవరకు బ్యాంకు సేవలు అందుబాటులో లేని వారికి బ్యాంకింగ్ – పేపర్లపై రాతకోతలు అత్యంత కనిష్ఠ స్థాయిలో ఉంచుతూ, కెవైసి, ఇ-కెవైసి నిబంధనల సడలింపు, జీరో నిల్వ, జీరో చార్జీలతో ప్రత్యేక శిబిరాల ద్వారా బ్యాంకు ఖాతాలు ప్రారంభించడం
– భద్రత లేని వారికి భద్రత – నగదు విత్ డ్రాయల్, వ్యాపారుల వద్ద చెల్లింపుల సదుపాయంతో పాటు రూ.2 లక్షల ఉచిత ప్రమాద బీమాతో కూడిన దేశీయ డెబిట్ కార్డుల జారీ
– నిధులు లేని వారికి నిధుల కల్పన – మైక్రో ఇన్సూరెన్స్, ఓవర్ డ్రాప్ట్, మైక్రో పెన్షన్, మైక్రో క్రెడిట్ వంటి పలు ఆర్థిక ఉత్పత్తులు అదుబాటు
3. ప్రాథమిక లక్షణాలు
ఈ దిగువ ఆరు మూల స్తంభాలపై ఈ స్కీమ్ ప్రారంభించారు.
– సార్వత్రిక బ్యాంకింగ్ సర్వీసులు – బ్రాంచిలు, బిజినెస్ కరెస్పాండెట్లు
– ప్రతీ ఒక్క ఇంటికీ రూ.10,000 ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయంతో బేసిక్ సేవింగ్స్ బ్యాంకు ఖాతా
– ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం – పొదుపు ప్రోత్సహం, ఎటిఎం వినియోగం, రుణం సంసిద్ధత, బీమా, పెన్షన్ సదుపాయాలు అందుకోవడం, బేసిక్ మొబైల్ ఫోన్ల సహాయంతో బ్యాంకింగ్ సర్వీసులు
– క్రెడిట్ గ్యారంటీ నిధి ఏర్పాటు – ఎగవేతదారుల నుంచి రక్షణకు బ్యాంకులకు ఒక తరహా హామీ
– బీమా – 2014 ఆగస్టు 15-2015 జనవరి 31 తేదీల మధ్య తెరిచిన ఖాతాలకు రూ.1,00,000 ప్రమాద బీమా కవరేజి, రూ.30,000 జీవితబీమా కవరేజి
– అవ్యవస్థీకృత రంగానికి పెన్షన్ పథకం
Achieved incredible success and yet miles to go…#6YearsOfJanDhanYojana #PMJDY #AatmanirbharBharat@PMOIndia @FinMinIndia @PIB_India pic.twitter.com/w4yDpNedfs
— DFS (@DFS_India) August 28, 2020
4. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పిఎంజెడివైలో ప్రధాన వైఖరి
– గతంలో అమలులో ఉన్న వెండాలర్లతో టెక్నాలజీ లాక్-ఇన్ తో కూడిన ఆఫ్ లైన్ అకౌంట్ ప్రారంభించే విధానానికి భిన్నంగా బ్యాంకులకు చెందిన కోర్ బ్యాంకింగ్ వ్యవస్ ద్వారా ఆన్ లైన్ అకౌంట్ల ప్రారంభం
– రుపే డెబిట్ కార్డు లేదా ఆధార్ అనుసంధానిత చెల్లింపు వ్యవస్థ (ఎఇపిఎస్) రెండింటిలో దేనితో అయినా ఖాతా ఆపరేట్ చేసుకునే వెసులుబాటు
– ఫిక్స్ డ్ పాయింట్ బిజినెస్ కరెస్పాండెంట్లు
– సంక్లిష్టమైన కెవైసి నిబంధనల స్థానంలో సరళీకృత కెవైసి/ ఇ-కెవైసి అమలు
5. పిఎంజెడివై కింద కొత్త ఫీచర్లు – కొన్ని మార్పులతో 28.8.2018 నుంచి సమగ్ర పిఎంజెడివై విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
– ప్రతీ ఒక్క కుటుంబం నిబంధనకు భిన్నంగా బ్యాంకింగ్ సదుపాయం లేని ప్రతీ ఒక్క వయోజనుడు నిబంధన అమలు
– రుపే కార్డు బీమా – 28.8.2018 తర్వాత ప్రారంభించే పిఎంజెడివై ఖాతాలకు రుపే కార్డులపై ఉచిత ప్రమాద బీమా రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంపు
ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం పెంపు
– ఒడి పరిమితి రెట్టింపు చేసి రూ.5,000 నుంచి రూ.10,000కి పెంపు; రూ.2,000 వరకు ఒడి (ఎలాంటి షరతులు లేకుండా)
– గరిష్ఠ వయోపరిమితి 60 నుంచి 65 సంవత్సరాలకు పెంపు
6. పిఎంజెడివై కింద విజయాలు – 19 ఆగస్టు, 2020 నాటికి
ఎ) పిఎంజెడివై ఖాతాలు
– 19 ఆగస్టు, 2020 నాటికి మొత్తం పిఎంజెడివై ఖాతాలు : 40.35 కోట్లు; గ్రామీణ పిఎంజెడివై ఖాతాలు : 63.6%, మహిళా పిఎంజెడివై ఖాతాలు :55.2%
– పిఎంజెడివై ప్రారంభించిన తొలి ఏడాదిలోనే 17.90 కోట్ల ఖాతాలు ప్రారంభం
– పిఎంజెడివై ఖాతాల నిరంతర పెరుగుదల
బి) నిర్వహణలోని పిఎంజెడివై ఖాతాలు
– ఆర్ బిఐ మార్గదర్శకాల కింద రెండు సంవత్సరాలకు పైబడి ఏదైనా కస్టమర్ ఖాతాలో ఎలాంటి లావాదేవీలు జరగకపోతే వాటిని నిర్వహణలో లేని పిఎంజెడివై ఖాతాలుగా పరిగణించాలి.
– 2020 ఆగస్టు నాటికి మొత్తం పిఎంజెడివై ఖాతాలు : 40.35 కోట్లు, నిర్వహణలోని ఖాతాలు 34.81% (86.3%)
– కస్టమర్ ఆపరేటివ్ ఖాతాల శాతం నానాటికీ పెరుగుతూ ఉండడం క్రమం తప్పకుండా అధిక సంఖ్యలో కస్టమర్లు ఖాతాలను ఆపరేట్ చేస్తున్నారనేందుకు తార్కాణం
PMJDY: Achieving milestones and making the waves worldwide since its inception. #6YearsOfJanDhanYojana #PMJDY #AatmanirbharBharat@PMOIndia @FinMinIndia @PIB_India pic.twitter.com/KF6ry9OYEz
— DFS (@DFS_India) August 28, 2020
సి) పిఎంజెడివై ఖాతాల్లో డిపాజిట్లు
– పిఎంజెడివై ఖాతాల్లో మొత్తం డిపాజిట్ నిల్వ రూ.1.31 లక్షల కోట్లు
– డిపాజిట్లలో 5.6 రెట్లు, ఖాతాల్లో 2.3 రెట్లు వృద్ధి (ఆగస్టు 20/ఆగస్టు 15)
డి) పిఎంజెడివై కింద సగటు డిపాజిట్
– ఒక్కో అకౌంట్ లో సగటు డిపాజిట్ రూ.3239
– ఒక్కో అకౌంట్ లో సగటు డిపాజిట్ ఆగస్టు 2015 నుంచి 2.5 రెట్లు వృద్ధి
– సగటు డిపాజిట్ పెరగడం అకౌంట్ల వినియోగం పెరగిందనేందుకు, అకౌంట్ హోల్డర్లలో పొదుపు అలవాటు పెరిగిందనేందుకు తార్కాణం
ఇ) పిఎంజెడివై ఖాతాదారులకు జారీ చేసిన రుపే కార్డులు
– పిఎంజెడివై ఖాతాదారులకు జారీ చేసిన మొత్తం రుపే కార్డులు : 29.75 కోట్లు
– రుపే కార్డుల జారీ, వాటి వినియోగం కూడా కాలం గడుస్తున్న కొద్ది పెరుగుదల
Achievements under PMJDY:
➡️Total RuPay cards issued to PMJDY account-holders: 29.75 Crore
(6/7)#6YearsOfJanDhanYojana pic.twitter.com/dqImuSMDQf— Ministry of Finance (@FinMinIndia) August 28, 2020
7. జన్ ధన్ దర్శక్ మొబైల్ యాప్
దేశంలోని బ్యాంకు శాఖలు, ఎటిఎంలు, బ్యాంకు మిత్రలు, పోస్టాఫీసులు వంటి టచ్ పాయింట్లను కనుగొనేందుకు పౌర సహాయక వేదికగా ఒక మొబైల్ అప్లికేషన్ ప్రారంభించారు. జిఐఎస్ యాప్ లో 8 లక్షల బ్యాంకింగ్ టచ్ పాయింట్లు నమోదయ్యాయి. సగటు పౌరులు తమ అవసరం, సౌకర్యం కోసం ఈ జన్ ధన్ దర్శక్ మొబైల్ యాప్ లోని సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్ వెర్షన్ ను ఈ లింక్ ద్వారా అందుకోవచ్చు. http://findmybank.gov.in.
5 కిలోమీటర్ల పరిధిలో బ్యాంకింగ్ టచ్ పాయింట్లు లేని గ్రామాలను గుర్తించేందుకు ఈ యాప్ ను ఉపయోగించవచ్చు. తదుపరి ఈ గుర్తించిన గ్రామాలను బ్యాంకింగ్ ఔట్ లెట్లు ప్రారంభించేందుకు వీలుగా సంబంధిత ఎస్ఎల్ బిసి పరిధిలోని వివిధ బ్యాంకులకు కేటాయించవచ్చు. ఈ ప్రయత్నం వల్ల బ్యాంకింగ్ టచ్ పాయింట్లు లేని గ్రామాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.
Celebrating 6 years of Pradhan Mantri Jan Dhan Yojana – A game changer for India’s Financial landscape.#6YearsOfJanDhanYojana #PMJDY #AatmanirbharBharat@PMOIndia @FinMinIndia @PIB_India pic.twitter.com/rDpiU25mZC
— DFS (@DFS_India) August 28, 2020
జెడిడి యాప్ ప్రకారం 5 కిలోమీటర్ల పరిధిలో బ్యాంకింగ్ టచ్ పాయింట్లు లేని గ్రామాలు
8. పిఎంజెడివై కింద మహిళా లబ్ధిదారులకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజి (పిఎంజికెపి)
26.3.2020 తేదీన ఆర్థిక మంత్రి ప్రకటించిన మేరకు పిఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పిఎంజెడివై) ఖాతాలున్న మహిళా లబ్ధిదారులందరి ఖాతాల్లో మూడు నెలల పాటు (ఏప్రిల్ ’20-జూన్ ’20) రూ.500 వంతున నగదు జమ చేశారు. ఏప్రిల్-జూన్, ,2020 మధ్య కాలంలో ఈ ఖాతాదారుల ఖతాల్లో రూ.30,705 కోట్లు జమ అయ్యాయి.
#PradhanMantriGaribKalyanPackage for #PMJDY women beneficiaries:
➡️amount of Rs. 500 per month for 3 months (Apr’20-Jun’20), was credited to women account holders under PMJDY
➡️A total of Rs. 30,705 cr credited in accounts of women PMJDY account holders during Apr-Jun, 2020
(7/7) pic.twitter.com/YIIBqyNMwZ— Ministry of Finance (@FinMinIndia) August 28, 2020
9. సకాలంలో డిబిటి లావాదేవీలకు చర్యలు :
బ్యాంకులు అందించిన సమాచారం ప్రకారం ప్రభుత్వ నిర్వహణలోని వివిధ స్కీమ్ ల కింద 8 కోట్ల మంది పిఎంజెడివై ఖాతాదారులు ప్రత్యక్ష నగదు బదలీ (డిబిటి) సౌకర్యం పొందుతున్నారు. అర్హులైన లబ్ధిదారులందరూ సకాలంలో డిబిటి పొందడానికి వీలు కల్పిస్తూ డిబిటి కార్యక్రమ నిర్వాహకులు, ఎన్ పిసిఐ, బ్యాంకులు, వివిధ మంతత్వ శాఖలతో చర్చించి డిబిటి వైఫల్యాలను నివారించవచగల కారణాలు గుర్తించడంలో ఆర్థిక శాఖ చురుకైన పాత్ర పోషించింది. బ్యాంకుల విసిలు, ఎన్ పిసిఐతో కలిసి క్రమం తప్పని నిశిత పర్యవేక్షణ ద్వారా ఏప్రిల్ 2019 నాటికి గల 5.23 లక్షల (0.20%) డిబిటి వైఫల్యాల సంఖ్యను జూన్ 2020 నాటికి 1.1 లక్షలకు (0.04%) తగ్గించడం సాధ్యమయింది.
PMJDY: Spearheading financial inclusion of women in Indian Economy. More than 50% account holders under PMJDY are women. #6YearsOfJanDhanYojana #PMJDY #AatmanirbharBharat@PMOIndia @FinMinIndia @PIB_India pic.twitter.com/3g3FGOMo7j
— DFS (@DFS_India) August 28, 2020
10. ముందున్న బాట
i. పిఎంజెడివై ఖాతాదారులందరికీ మైక్రో బీమా పథకాల కింద కవరేజి కల్పించేందుకు గట్టిగా కృషి చేయాల్సి ఉంది. అర్హులైన పిఎంజెడివై ఖాతాదారులందరూ పిఎంజెజెబివై, పిఎంఎస్ బివై కింద కవరేజి పొందేలా చూడాలి. బ్యాంకులకు దీని గురించిన సమాచారం ఇప్పటికే పంపడం జరిగింది.
ii. దేశవ్యాప్తంగా అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉంచడం ద్వారా పిఎంజెడివై ఖాతాదారులందరూ రుపే డెబిట్ కార్డులు వినియోగించడం, డిజిటల్ లావాదేవీలు నిర్వహించడానికి అవసరమైన ప్రోత్సాహం ఇవ్వనున్నారు.
iii. పిఎంజెడిబై ఖాతాదారులందరికీ మైక్రో క్రెడిట్ తో పాటు ఫ్లెక్సి రికరింగ్ డిపాజిట్ సహా వివిధ మైక్రో పెట్టుబడి సాధనాల అందుబాటును పెంచుతారు.
Achieved incredible success and yet miles to go…#6YearsOfJanDhanYojana #PMJDY #AatmanirbharBharat@PMOIndia @FinMinIndia @PIB_India pic.twitter.com/w4yDpNedfs
— DFS (@DFS_India) August 28, 2020
Be the first to comment