
దుబాయ్: సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 మధ్య జరిగే ఐపీఎల్ పోటీల్లో పాల్గొనేందుకు యూఏఈ వెళ్లిన క్రికెటర్ రైనా ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. ధోనీ సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆయన ఆడాల్సి ఉంది. వ్యక్తిగత కారణాలతో భారత్‌కు వచ్చినట్లు రైనా తెలిపారు. జట్టుకు రిమైండర్‌గా రైనా ఉంటారని, కష్టకాలంలో రైనా కుటుంబానికి అండగా ఉంటామని చెన్నై సూపర్ కింగ్స్ ట్వీట్ చేసింది.
Suresh Raina has returned to India for personal reasons and will be unavailable for the remainder of the IPL season. Chennai Super Kings offers complete support to Suresh and his family during this time.
KS Viswanathan
CEO— Chennai Super Kings (@ChennaiIPL) August 29, 2020
అటు ఉత్తరప్రదేశ్ క్రికెట్ అకాడమీ కూడా రైనా భారత్‌కు తిరిగి వస్తున్నారని ధృవీకరించింది.
Ready to Shine!
Suresh Raina has retired from the international cricket. This is not a full stop for him.The pride of #UPCA Suresh Raina will don the ranks of @ChennaiIPL
Best of luck for an amazing performance at UAE IPL 2020 #WhistlePodu #AllTheBest #IPL2020 pic.twitter.com/cHENrz43L3— UPCA (@UPCACricket) August 28, 2020
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో కరోనా కలకలం రేగింది. ప్లేయర్లకు నిర్వహించిన కరోనా టెస్టుల్లో కొందరికి పాజిటవ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వారికి మరో వారం పాటు క్వారంటైన్ పొడిగించారు. దీని వల్ల ప్రాక్టీస్‌పై ప్రభావం పడుతుందని, సూపర్‌కింగ్స్ జట్టుకు ఇది గట్టి ఎదురుదెబ్బగా మారనుంది. నిజానికి ఈ నెల 21న జట్టు దుబాయ్ చేరుకోగా, క్వారంటైన్ 28కి ముగియాల్సిన తరుణంలో కరోనా సోకిన కారణంగా మరో 7 రోజుల క్వారంటైన్ పొడిగించారు.
Be the first to comment