
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న వారితో పాటు ముఖ్యంగా యువతకు ప్రధాని ధన్యవాదాలు చెప్పారు. తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణా దృక్పథంతో, ఎన్నో తరాలపై చెరగని ముద్ర వేసిన గిడుగు వెంకట రామమూర్తికి నివాళులు అర్పిస్తున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపారు. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు భాషలో కూడా ఆయన ట్వీట్ చేశారు.
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ ముఖ్యంగా యువతకి నా ధన్యవాదాలు.
తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాల పై చెరగని ముద్ర వేసిన గిడుగు వెంకట రామమూర్తి గారికి ఈ రోజు నేను నివాళులు అర్పిస్తున్నాను.— Narendra Modi (@narendramodi) August 29, 2020
Greetings on Telugu Language Day. Today we appreciate all those who are making Telugu popular, especially among the youth. I also pay tributes to the great Gidugu Venkata Ramamurthy, whose thoughts, writings and social reform endeavours have left a lasting impact on generations.
— Narendra Modi (@narendramodi) August 29, 2020
Be the first to comment