
న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్కు రూపాయి జరిమనా విధించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. జరిమానా చెల్లించకపోతే మూడు నెలల జైలు విధిస్తామని స్పష్టం చేసింది. అదే సమయంలో జరిమానా కట్టకపోతే మూడు సంవత్సరాల పాటు న్యాయవాద వృత్తి చేపట్టకుండా నిషేధం విధిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన రెండు ట్వీట్ల నేపథ్యంలో ఆయనపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది.
Supreme Court imposes a fine of Re 1 fine on Prashant Bhushan. In case of default, he will be barred from practising for 3 years & will be imprisoned of 3 months https://t.co/0lMbqiizBb
— ANI (@ANI) August 31, 2020
తీర్పు తర్వాత ప్రశాంత్ భూషణ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తన న్యాయవాది రాజీవ్ ధావన్ తనకిచ్చిన రూపాయిని తీసుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. రెండు ఫొటోలు కూడా జత చేశారు.
My lawyer & senior colleague Rajiv Dhavan contributed 1 Re immediately after the contempt judgement today which I gratefully accepted pic.twitter.com/vVXmzPe4ss
— Prashant Bhushan (@pbhushan1) August 31, 2020
Be the first to comment