ప్రణబ్ భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ప్రముఖులు..

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భౌతికకాయం వద్ద పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. న్యూఢిల్లీలోని ప్రణబ్ నివాసంలో ఆయన పార్థీవ దేహాన్ని ఉంచారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇతర ప్రముఖులు ప్రణబ్‌కు నివాళులర్పించారు.

ప్రణబ్ కుటుంబ సభ్యులతో కూడా మోదీ మాట్లాడారు. వారిని ఓదార్చారు.

ప్రణబ్ భౌతికకాయం వద్ద కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ శ్రద్ధాంజలి ఘటించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా, పలువురు కేంద్ర మంత్రులు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేతలు ప్రణబ్ భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.

వివిధ పార్టీల నేతలు కూడా ప్రణబ్ భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*