సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలను చైతన్యపరుస్తోన్న ఆకాశవాణి

సైబర్ నేరాలపై సైబరాబాద్ కమిషనర్‌తో ఆకాశవాణి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం

హైదరాబాద్: టెక్నాలజీ వాడకం పెరిగినప్పటినుంచీ సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా లాక్‌డౌన్ వేళ సైబర్ నేరాలు మరింత అధికమయ్యాయి. దీంతో సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలను చైతన్యపరిచేందుకు ఆకాశవాణి నడుం బిగించింది. సైబరాబాద్ కమిషనర్‌ వి.సి. సజ్జనార్‌తో ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది.

సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బెట్టింగ్, లాటరీలపై సజ్జనార్‌తో ఆకాశవాణి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది.

ఈ నెల 4వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో పాల్గొనాలనుకునే శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్లు. 040-23244834, 040-23244836, 040-29704324

ఈ కార్యక్రమాన్ని తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్‌ఎం రెయిన్‌బో(101.9) ప్రసారం చేస్తాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*