
హైదరాబాద్: ‘నిరంకుశ నిజాం – విముక్తి పోరాటాలు’ పేరుతో జాతీయ సాహిత్య పరిషత్ లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ధర్మ జాగరణ అఖిల భారత సహ ప్రముఖ్ ఆలె శ్యామ్( శ్యాంజీ) పాల్గొననున్నారు. ఫేస్ బుక్ లైవ్లో ఈ అంశంపై ఉపన్యసించనున్నారు. సోమవారం సాయంత్రం 6.00 గంటల నుంచి 7.00 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది.
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల సాహితి సమితి సభ్యులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వేణుగోపాల్ తెలియజేశారు. కుటుంబ సమేతంగా చూడవలసిందిగా విజ్ఞప్తి చేశారు. సాహితీ సమితి ఇటీవల నిర్వహించిన భారతీయం సత్యవాణిగారి ప్రసంగానికి అనూహ్య స్పందన వచ్చినట్లు వేణుగోపాల్ తెలిపారు. సాహితీ సమితి కార్యక్రమాలను ఆదరిస్తున్న సాహిత్యాభిలాషులకు వేణుగోపాల్ ధన్యవాదాలు తెలిపారు
Be the first to comment