
ఏలూరు: ఉపాధ్యాయురాలిగా ఎందరో విద్యార్థులను తీర్చితిద్దిన గూడూరు సీతామహాలక్ష్మికి సంపదను తోటివారికి పంచే గుణం కూడా ఉంది. మూఢ, అంధ విశ్వాసాలను ప్రోత్సహించేలా ఉండకూడదని చెప్పిన తన మాస్టారు కలిదండి రాఘవ రాజు మాటను ఆదర్శంగా తీసుకున్నారు. ఒక ఉపాధ్యాయురాలు పది మంది గొప్ప వ్యక్తులను తయారు చేయగలదన్న తన తండ్రి గూడూరు అర్జునుడు మాటలతో స్ఫూర్తి పొందారు. శ్రీశ్రీ కవితలకు ప్రేరణ చెంది, అంబేద్కర్ రాజనీతిని అంశాలను అర్ధం చేసుకున్నారు. సావిత్రిబాయి పూలే ఆదర్శాలతో జీవిస్తున్నారు. ప్రస్తుతం.. బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా అంబేద్కర్ రాజనీతి ఉద్యమ నిర్మాణంలో కృషి చేస్తున్నారు. గూడూరు సీతామహాలక్ష్మీ జీవిత ప్రయాణం ఆమె మాటల్లోనే….
Be the first to comment